Moviesరవితేజ "ఈగల్" ట్వీట్టర్ రివ్యూ: మాస్ కి అమ్మ మొగుడే.. ఒక్కోక్కడికి...

రవితేజ “ఈగల్” ట్వీట్టర్ రివ్యూ: మాస్ కి అమ్మ మొగుడే.. ఒక్కోక్కడికి పోయించేశాడు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పాపులారిటీ సంపాదించుకున్న రవితేజ తాజాగా నటించిన సినిమా ఈగల్ . అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. గత కొంతకాలంగా హిట్ లేకుండా అల్లాడిపోతున్న రవితేజకు ఈ సినిమా నుంచి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి . మరీ ముఖ్యంగా ఈ సినిమా రవితేజ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిన కిక్ ఎక్కించేసింది .

ఈ సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్స్ అభిమానులకు ఓ రేంజ్ లో పూనకాల తెప్పిస్తున్నాయి . మరి ముఖ్యంగా ఈ సినిమా మొదటి నుంచి రవితేజ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రవితేజకు మంచి రెస్పాన్స్ ఏ దక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సినిమా ఆటోగ్రాఫర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్షన్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.

రవితేజ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించాడు కార్తిక్. అనుపమ నటన కూడా బాగుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కావ్య ధాపర్ నటించింది . ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లోగా వెళ్ళిన సెకండ్ హాఫ్ యావరేజ్ గా నిలిచింది. డైరెక్షన్ బాగుంది సినిమా చూసిన జనాలు కామెంత్స్ చేస్తున్నారు. మరొక నెటిజన్ వన్ టైం వాచబుల్ అంటూ కామెంట్ చేశారు . మొత్తానికి రవితేజ పెర్ఫార్మన్స్ ఊర నాటుగా ఉందని మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news