Moviesకలలో కూడా ఎవ్వరు ఊహించని డైరెక్టర్ తో మూవీ కి కమిట్...

కలలో కూడా ఎవ్వరు ఊహించని డైరెక్టర్ తో మూవీ కి కమిట్ అయిన ఎన్టీఆర్.. మరో యమదొంగ లాంటి హిట్ పక్కా..!!

ఇది నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రెసెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించాల్సి ఉంది . అయితే కొన్ని కారణాల చేత ఆ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది. అంతేకాదు బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో కూడా నటించబోతున్నాడు ఎన్టీఆర్ .

అయితే ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ తో సినిమా ఆగిపోయింది అని తెలుసుకున్న అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. అదే మూమెంట్ లో ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయ్యాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు లోకేష్ కనకరాజ్. ఈ మధ్యకాలంలో లోకేష్ కనకరాజ్ ఎలా పాపులారిటీ సంపాదించుకున్నాడో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాయి ఆయన మూవీలు.

కాగా చరణ్ తో ఆయన ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపించాయి. కానీ చరణ్ ప్రెసెంట్ గేమ్ ఛేంజర్ సినిమా షూట్ లేట్ అవ్వడంతో ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వం సినిమా కమిట్ అవ్వడంతో లోకేష్ కనకరాజ్ సినిమా ఆలస్యం అవుతుందట . ఈ క్రమంలోనే ఎన్టీఆర్కు ఆ కథ వివరించారట లోకేష్ . ఎన్టీఆర్ కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది . దీంతో క్రేజీ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ ఫిక్స్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news