Moviesఅప్పుడు సమంత కోసం నాగచైతన్య.. ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం రష్మిక.....

అప్పుడు సమంత కోసం నాగచైతన్య.. ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం రష్మిక.. ప్రేమంటే ఇదే రా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత హీరో నాగచైతన్యకు ఎలాంటి క్రేజీ పాపులారిటీ ఉందో మనకు తెలిసిందే. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే వీళ్ళు విడాకులు తీసుకున్న సరే మళ్లీ కలుస్తారు అంటూ కోట్లాదిమంది అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ అది జరగదు అని తెలిసినా ఫ్యాన్స్ ఇంకా ఆశపడుతూ ఉండటం అందరికి విచిత్రంగానే ఉంది.

కాగా రీసెంట్గా సమంత బాలీవుడ్ సినిమాలకు కమిట్ అవుతుంది అని మనం వార్తలు వింటున్నాం. కాగా నాగచైతన్య కూడా తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . గతంలో సమంత కోసం నాగచైతన్య సినిమాలో చిన్న గెస్ట్ పాత్రలో నటించి మెప్పించాడు.. ఇప్పుడు అదే విధంగా రష్మిక మందన్నా సైతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో గెస్ట్అపీరియన్స్ ఇవ్వబోతుంది అన్న వార్త వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో కలిసి నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్ . పరశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రష్మిక కూడా గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాలో రష్మిక ఇచ్చే ట్వీస్ట్ అద్దిరిపోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news