Moviesఆ సూసైడ్ హీరోయిన్ బయోపిక్ లో నటించబోతున్న లావణ్య త్రిపాఠి .....

ఆ సూసైడ్ హీరోయిన్ బయోపిక్ లో నటించబోతున్న లావణ్య త్రిపాఠి .. పెద్ద కాంట్రవర్షియల్ కంటెంట్ నే టచ్ చేసిందే..!

ఈ మధ్యకాలంలో లావణ్య త్రిపాఠి పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా మెగా కోడలు అయిన తర్వాత లావణ్య త్రిపాఠి క్రేజ్ పాపులారిటీ మరింత హై స్థానంలోకి వెళ్లిపోయాయి . అంతేకాదు ఒకప్పుడు రాని మంచి మంచి ఆఫర్స్ కూడా ఆమె ఖాతాలోకి వచ్చి చేరుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఫస్ట్ వెబ్ సిరీస్ ను చేసింది. ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది.

అయితే ఇప్పుడు ఆమె ఓ కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రత్యూష సూసైడ్ ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆమె మరణం పై మిస్టరీ అలానే ఉంది. పలువురు పొలిటీషియన్స్ కూడా ఆమె మరణం లో భాగమై ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే అలాంటి ప్రత్యూష బయోపిక్ లో ఆమె నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ప్రత్యూష మరణానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను కూడా ఈ సినిమా ద్వారా బయట పెట్టబోతున్నారట డైరెక్టర్ . కాంట్రవర్షియల్ కంటెంట్ అయినా సరే లావణ్య త్రిపాఠి రోల్ ని యాక్సెప్ట్ చేసిందట . అంతేకాదు దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు . పోయి పోయి ఆ కాంట్రవరషియల్ కంటెంట్ ఎందుకు టచ్ చేసావ్ లావణ్య అంటూ ఫైర్ అవుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news