Moviesఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా సైన్ చేసిన ఆ హిట్ సినిమా మహేష్...

ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా సైన్ చేసిన ఆ హిట్ సినిమా మహేష్ బాబు ఖాతాలోకి ఎలా వెళ్ళింది ..? తెర వెనక ఇంత కుట్ర జరిగిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . అయితే కొన్నిసార్లు అది బై మిస్టేక్ జరగొచ్చు .. మరి కొన్నిసార్లు మాత్రం వాంటెడ్ గానే కొందరు పెద్దమనుషులు ఈ ప్రాజెక్టు మా వాడికైతే బాగుంటుంది .. మా హీరో కైతే బాగుంటుంది అంటూ ముందుగానే ఆ స్టోరీను కమిట్ అయిన హీరో దగ్గర నుంచి లాగేసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ అలాంటి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఖాతాలో నుంచి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది . ఆ సినిమా మరేదో కాదు మురారి . కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్స్ అందుకుంది . మహేష్ బాబు కెరీయర్ నే మార్చేసింది . నిజానికి ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ని అనుకున్నారట కృష్ణవంశీ .

ఎన్టీఆర్ కూడా లైక్ చేశాడట . రేపు అగ్రిమెంట్ పై సైన్ చేయాలి అన్న రోజు ఆ ప్రాజెక్టు మహేష్ బాబు చేతిలోకి వెళ్ళిపోయింది . తెరవనక ఓ పెద్దమనిషి ఉండే ఈ ప్రాజెక్టును ఎన్టీఆర్ ఖాతా నుండి మహేష్ బాబు ఖాతాలోకి పంపించేసాడు అన్న ప్రచారం అప్పట్లో జరిగింది . మొదటినుంచి ఇలాంటివి పెద్దగా పట్టించుకోని ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండిపోయాడు. అంతేకాదు ఎన్టీఆర్ – మహేష్ బాబు మంచి ఫ్రెండ్స్ నాకంటే ఈ సినిమా మురారి మహేష్ బాబు కి బాగా సెట్ అయింది అంటూ అనుకొని ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నారట. ఇండస్ట్రీలో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చాలా కామన్ అని అందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news