Moviesరజినీకాంత్ ‘లాల్ స‌లామ్‌’ ట్వీట్టర్ రివూ: ఫ్యాన్స్ కి పండగ..మిగతవాళ్లకి పెద్ద...

రజినీకాంత్ ‘లాల్ స‌లామ్‌’ ట్వీట్టర్ రివూ: ఫ్యాన్స్ కి పండగ..మిగతవాళ్లకి పెద్ద దండగ..!

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మళ్లీ డైరెక్షన్ ప్రారంభించి బాధ్యతలు తీసుకొని తెరకెక్కించిన మూవీ లాల్ సలాం . ఈ సినిమాపై కోలీవుడ్ జనాలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశారో మనకు తెలిసిందే. సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేశారు. విష్ణు విశాల్ , విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కొద్దిసేపటికి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది .

ఈ సినిమాలో రజనీకాంత్ కీలక పాత్రలో కనిపించడం విశేషం . అలాగే భారత్ క్రికెటర్ కపిల్ దేవ్ – టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ జీవిత రాజశేఖర్ కూడా ముఖ్య పాత్రలో కనిపించారు . లైకా ప్రొటెక్షన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు తమిళ్ భాషలలో గ్రాండ్గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ దక్కించుకునింది . సినిమా చూసిన జనాలు సినిమాపై తమదైన స్టైల్ లో రివ్యూ ఇస్తున్నారు. కొందరు సినిమా బాగుంది అని కానీ ఒక్క రేంజ్ వరకే ఎక్స్పెక్ట్ చేయగలము అని .. థియేటర్స్ కి వెళ్లి విజిల్స్ వేసే అంత సీన్స్ ఏమీ లేవని చెప్పుకు వచ్చారు.

మరికొందరు ఇది పూర్తిగా ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీ అని .. ఫ్యామిలీస్ ను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చారు . మరికొందరు సినిమా మొత్తం ఎలా ఉన్నా రజినీకాంత్ కనిపించిన ఆ 20 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ అంటూ చెప్పుకొస్తున్నారు . ముస్లింగా రజనీకాంత్ గెటప్ అదిరిపోయింది అని ..ఐశ్వర్య రాజినీకాంత్ డైరెక్టర్ వెటృఈమారన్ ని కాపీ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు రజనీకాంత్ నటించినటువంటి 20 మినిట్స్ తప్పిస్తే సినిమాలో పెద్దగా హైలెట్ సీన్స్ ఏవి లేవని డైరెక్షన్ పరంగా ఐశ్వర్య ఇంకా బాగా పికప్ అవ్వాలి అని సలహాలు ఇస్తున్నారు . కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ కామెంట్స్ తో లాల్ సలాం థియేటర్స్ లో రన్ అవుతుంది . చూద్దాం ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news