Moviesఅదే జరిగితే ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం అంత కఠినంగా ఉంటుందా..ఒక్కోక్కడి ఉ*...

అదే జరిగితే ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం అంత కఠినంగా ఉంటుందా..ఒక్కోక్కడి ఉ* పడిపోవాల్సిందేనా..?

ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న దేవర సినిమా పోస్ట్ పోన్ అయిన విషయం అభిమానులకు తీవ్ర హర్టింగ్గా అనిపిస్తుంది . దేవర సినిమాను ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్ . కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు .

దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా హర్ట్ అయ్యారు . ఎన్టీఆర్ థియేటర్స్ లో కనిపించి చాలా సంవత్సరాలు అవుతుంది . దేవరతో ఆ ముచ్చట తీరిపోతుందని.. మరోసారి అలాంటి హిట్ అందుకుంటాడు అని ఆశపడ్డారు అభిమానులు. కానీ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అభిమానులకి ఇబ్బందికరంగా మారింది . అదే తేదీన విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతూ ఉండడం మరింత డీలాల పడిపోయేలా చేసింది .

అయితే ఇప్పుడు అక్టోబర్ 10 కూడా పోస్ట్ పోన్ చేసేలా ఇండస్ట్రీలో ఉండే కొన్ని దుష్ట శక్తులు ట్రై చేస్తున్నాయట. దీంతో నందమూరి ఫ్యాన్స్ బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అదే జరిగి దేవర సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే పరిస్ధితి వస్తే మాత్రం ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం కఠినంగా ఉంటుందని ..ఒక్కొక్క హీరోకి ఉ** పడిపోవాల్సిందేనని చాలా ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news