Movies"సైకిల్ గుర్తుకే మన ఓటు".. సెన్సేషనల్ వీడియోని రిలీజ్ చేసిన హీరోయిన్...

“సైకిల్ గుర్తుకే మన ఓటు”.. సెన్సేషనల్ వీడియోని రిలీజ్ చేసిన హీరోయిన్ సమంత..!!

కేవలం కొద్ది రోజులంటే కొద్ది రోజులే .. మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే పొలిటికల్ పరంగా హీట్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో సినీ ప్రముఖులు కూడా ఎక్కువగా పోటీ చేస్తూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీ పై కూడా ఎన్నికల ప్రభావం బాగా పడింది . సినీ లవర్స్ కూడా ఎన్నికలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

రీసెంట్గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన టిడిపి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . ఆ వీడియోలో..” అభివృద్ధికి మీ ఓటు కాబట్టి సైకిల్ గుర్తుకే ఓటు వేయండి ” అని సమంత చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది . అయితే సమంత టీడీపీకి సపోర్ట్ చేస్తున్న ఈ వీడియో ఇప్పటిది కాదు . 2019లో జరిగిన ఎన్నికల సమయంలో సమంత తన ఫ్యామిలీ ఫ్రెండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఆ వీడియోను రిలీజ్ చేసింది.

అప్పట్లో ఈ వీడియో సెన్సేషన్ గా మారింది . కాగా త్వరలోనే ఎన్నికలు జరగబోతూ ఉండడంతో ..మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రజెంట్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . మంచి మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది . మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న సమంత సినిమాలను నిర్మించాలని కూడా ట్రై చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news