Moviesరష్మిక చేసిన పనికి కోపంతో ఊగిపోతున్న బన్నీ అభిమానులు... మొత్తం పెంట...

రష్మిక చేసిన పనికి కోపంతో ఊగిపోతున్న బన్నీ అభిమానులు… మొత్తం పెంట పెంట చేసేసిందిగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా ఇండస్ట్రీకి కొత్తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి . సినిమాకి సంబంధించిన క్రేజీ క్రేజీ పిక్స్ – పాటలు- వీడియోలు మరికొన్ని సినిమాల విషయంలో టోటల్ సినిమా కూడా లీక్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వకముందే మొత్తం సినిమా లీక్ అయ్యి అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చింది . అయితే మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పుష్ప2కి సంబంధించిన పోస్టర్స్ – క్లిప్స్ – ఫైట్ సీన్స్ నెట్టింట బాగా లీక్ అయి వైరల్ అవుతున్నాయి .

కాగా ఇప్పటికే పుష్పట్టు సినిమాకి సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ పిక్స్ సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు లీక్ చేసి సినిమాపై ఉన్న క్రేజ్ ను కొంచెం కొంచెం తగ్గించేస్తూ ఉండగా ..రీసెంట్గా రష్మిక మందన్నా పుష్ప2 సెట్స్ నుంచి డైరెక్టర్ సుకుమార్ క్రేజీ ఫోటోని షేర్ చేసింది . రష్మిక మందన్నా షేర్ చేసిన సుకుమార్ ఫోటోలో పుష్ప2 సెట్స్ కి సంబంధించిన బ్యాగ్రౌండ్ క్లియర్ గా తెలిసిపోతుంది . బంతి పూలతో డెకరేషన్ చేసి సింహం బొమ్మలను అమర్చి ఉన్నారు . ఇది కచ్చితంగా సినిమాను మలుపు తిప్పే గంగమ్మ జాతర సీన్స్ తెరకెక్కించిన సెట్స్ గా అభిమానులు చెప్పుకొస్తున్నారు .

అయితే ఇలా రష్మిక మందన్నా టాప్ సీన్ కి సంబంధించిన క్రేజీ ఫోటోను షేర్ చేయడంతో అభిమానులు మండిపడుతున్నారు . వేరే వాళ్ళు లీక్ చేస్తే ఫైర్ అవుతారు .. మరి మీ సినిమా షూట్ పిక్స్ మీరు షేర్ చేసుకోవచ్చా..? ఇప్పుడు తప్పు రాదా ..? అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు బన్ని అభిమానులకు ముందు నుంచే రష్మిక అంటే కోపంగా ఉంది . ఈ మధ్యకాలంలో అనిమల్ సినిమా చూశాక ఆ కోపం డబల్ అయిపోయింది . ప్రెసెంట్ రష్మికపై ఘాటు కామెంట్స్ తో ట్రోలింగ్ చేస్తున్నారు . ఈ శ్రీవల్లి మా కొంప ముంచేసిందే మొత్తం సర్వనాశనం చేసేస్తుంది అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news