Moviesఆ విషయంలో ఎన్టీఆర్ కాలి గోటికి కూడా పనికిరాని పాన్ ఇండియా...

ఆ విషయంలో ఎన్టీఆర్ కాలి గోటికి కూడా పనికిరాని పాన్ ఇండియా హీరోలు.. దేవర కోసం బిగ్ సాహసమే చేస్తున్నాడుగా..!!

ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా దేవర . టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఇండియా చిత్రమే ఈ దేవర. ఈ సినిమా కోసం కొరటాల శివ – ఎన్టీఆర్ బాగా కష్టపడుతున్నారు . ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయిన సోషల్ మీడియాలో ఫాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది . మరో మరాఠీ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

కాగా ఈ మధ్యకాలంలో షూటింగ్ కి గ్యాప్ తీసుకున్న దేవర టీం మళ్లీ మార్చి 14న ఈ సినిమాను కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది . అంతేకాదు ఈసారి షెడ్యూల్లో ఒక క్రేజీ పాటను కూడా చిత్రీకరించబోతున్నారట . ఇలాంటి క్రమంలోనే దేవర సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ పెద్ద సాహసమే చేస్తున్నాడట . ఈ సినిమాలో భారీ భారీ ఫైట్ సీన్స్ ఉన్నాయట .

వాటర్ మధ్యలో వచ్చే ఫైట్ సీన్ అభిమానులకి బాగా నచ్చేస్తుందట . అయితే జనరల్ గా ఇలాంటి డిఫికల్ట్ ఫైట్ సీన్స్ లో ఎవరైనా సరే డూప్ ని చూస్ చేసుకుంటారు . చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలు చేసే పని అదే . కానీ ఎన్టీఆర్ మాత్రం డూపు వద్దనే వద్దు అంటూ చెప్పేసాడట . ఎన్టీఆర్ ఈ సినిమా నేను ఓన్ గా చేస్తాను అంటూ కష్టమైన సీన్స్ ని కూడా రిస్క్ షాట్స్ ని కూడా తానే నటించడానికి ఒప్పుకున్నారట . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయన పొగడేస్తున్నారు . రియల్ హీరో అంటే నువ్వే.. నీ కాలి గోటికి కూడా మిగతా హీరోలు పనికిరారు అంటూ ప్రశంసలతో ముంచేత్తుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news