Moviesబెల్లీ డ్యాన్స్ తో బేబ్బమ్మ జాతకం మారిపోయిందిరోయ్.. 100 కోట్ల జాక్...

బెల్లీ డ్యాన్స్ తో బేబ్బమ్మ జాతకం మారిపోయిందిరోయ్.. 100 కోట్ల జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు .. ఎవరి టైం.. ఎలా మారిపోతుందో .. ఎవరు చెప్పలేరు అన్నదానికి మరొక ఎగ్జాంపుల్ గా మారింది కృతి శెట్టి . మొదట యాడ్స్ లో నటించి ఆ తర్వాత సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా అంతా కాదు . ఓవర్ నైట్ లోనే ఆమె పేరు మారు మ్రోగిపోయింది . ఓ సమంత .. ఓ శృతిహాసన్ .. ఓ కీర్తి సురేష్ .. మరో కృతి శెట్టి అనే రేంజ్ లో అమ్మడుని పొగిడేసారు .

ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా పర్లేదనిపించాయి . అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు అనిపించడంతో కృతి శెట్టి కెరీర్ కు బ్రేకులు పడ్డాయి . తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయినా .. తమిళంలో మాత్రం మంచిగానే అవకాశాలు దక్కించుకుంది .. తమిళ్లో అవకాశాలు దక్కించుకుంటూ సోషల్ మీడియా ద్వారా తెలుగు జనాలను కవ్విస్తూ వచ్చిన కృటి శెట్టి రీసెంట్గా ఒక బెల్లీ డాన్స్ వీడియోను షేర్ చేసింది .

ఈ వీడియోలో టూ హాట్ అండ్ సెక్సీగా కనిపించింది కృటి శెట్టి . ఈ వీడియో పుణ్యమో లేక అమ్మడు అదృష్టమో తెలియదు కానీ ఈ వీడియో రిలీజ్ చేసిన కేవలం 24 గంటల్లోనే ఆమె అద్భుతమైన ఆఫర్ ని అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . పాన్ ఇండియా సినిమాలో జాక్ పాట్ ఆఫర్ కొట్టేసింది కృతి శెట్టి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెలుగు హీరోతో తెరకెక్కించే సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . ఈ క్రమంలోనే తెలుగు జనాలు కృతి శెట్టి లక్ ని పొగిడేస్తున్నారు . ఫైనల్లీ బెల్లీ చూపించి బంపర్ ఆఫర్ కొట్టేసావ్ అనమాట అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news