Moviesబిగ్ షాకింగ్: పుష్ప2 నుంచి మరో క్రేజీ ఫోటో లీక్.. సినిమా...

బిగ్ షాకింగ్: పుష్ప2 నుంచి మరో క్రేజీ ఫోటో లీక్.. సినిమా సగం సస్పెన్స్ సంక నాకి పాయే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక లీకు రాయళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమాకి సంబంధించిన పలు పాటలను క్లిప్స్ ను ఫొటోస్ ను వీడియోస్ ని సోషల్ మీడియాలో లీక్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. రీసెంట్గా చాలా సినిమాలు కూడా ఈ లీకుల విషయంలో బాధపడ్డాయ్. కాగా రీసెంట్గా పుష్ప సినిమాకి సంబంధించి మరో క్రేజీ మ్యాటర్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ఈ మధ్యకాలంలో పుష్ప2 సినిమాకి సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో ఎలా లీక్ అయిపోతున్నాయో మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న పుష్ప రాజ్ చీర కట్టుకున్న ఫోటో లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇప్పుడు సినిమాకి సంబంధించిన మరో కీ క్యారెక్టర్ కి రిలేటెడ్ ఫోటో వైరల్ గా మారింది . పుష్ప సినిమాలో ఎంపీ భూమిరెడ్డి సిద్ధప్ప నాయుడు క్యారెక్టర్ లో రావు రమేష్ కనిపిస్తాడు .

ఎర్రచందనం సిండికేట్ బిజినెస్ కి హెడ్ గా పుష్ప పార్ట్ వన్ లో ఈ సిండికేట్ని పుష్ప చేతికి అప్పగించిన సిద్ధప్ప నాయుడు పై ప్రజెంట్ షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ స్పాట్ నుంచి రావు రమేష్ ప్రజా చైతన్య పార్టీ అనే ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి . దీనితో బన్నీ ఫాన్స్ కంగారు పడుతున్నారు . సినిమా రిలీజ్ కి ముందే మొత్తం సినిమాని లీక్ చేసేలా ఉన్నారు అంటూ మండిపడుతున్నారు. ప్రజెంట్ బన్నీ ఫాన్స్ ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ కాబోతుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news