Moviesమ‌హేష్‌బాబు భార్య న‌మ్ర‌త‌లో మెగాస్టార్‌కు పిచ్చ‌గా న‌చ్చేసిన క్వాలిటీ ఇదే..!

మ‌హేష్‌బాబు భార్య న‌మ్ర‌త‌లో మెగాస్టార్‌కు పిచ్చ‌గా న‌చ్చేసిన క్వాలిటీ ఇదే..!

అదేంటి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు భార్య నమ్ర‌తా శిరోద్క‌ర్‌కు మెగాస్టార్ చిరంజీవికి లింక్ ఏంటి ? న‌మ్ర‌తో క్వాలిటీ చిరంజీవికి న‌చ్చ‌డం ఏంట‌నుకున్నారా ? అవును వీరిద్ద‌రు క‌లిసి ఓ సినిమాలో కూడా న‌టించారు. ఆ సినిమా పేరే అంజి. 2004 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను ఎంఎస్‌. ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎం. శ్యాంప్ర‌సాద్ రెడ్డి నిర్మించారు. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దేవి సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక చిరంజీవితో గ్రాఫిక్స్ నేప‌థ్యంలో సోషియా ఫాంట‌సీ క‌థాంశంలో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నారు.

1998లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఏకంగా 6 ఏళ్ల పాటు నిర్మాణం జ‌రుపుకుంది. వ‌డ్డీల‌తో క‌లుపుకుంటే నిర్మాణ వ్య‌యం త‌డిసి మోపెడు అయ్యింది. అప్ప‌ట్లో అంజి నిర్మాణం ఓ సెన్షేష‌న్‌. సినిమాలో ఆరు పాట‌ల‌కు ఆరుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు.. బాలీవుడ్‌తో పాటు విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల‌ను కూడా తీసుకువ‌చ్చి మ‌రీ అంజి యాక్ష‌న్ డిజైన్ చేశారు. మ‌ధ్య‌లో బ‌డ్జెట్ పెరిగిపోవ‌డంతో షూటింగ్ ఆగిపోయింది.

అనుకున్న దానికంటే ఖ‌ర్చు ఎక్కువ కావ‌డంతో నిర్మాత శ్యాం ప్ర‌సాద్ రెడ్డి సినిమాను వ‌దిలేశారు. త‌ర్వాత మ‌ళ్లీ కాస్త అమౌంట్ చూసుకోవ‌డం.. మ‌రో షెడ్యూల్ ప్లాన్ చేసుకోవ‌డం.. ఇలా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ఆరేళ్ల పాటు ఎన్నో వ్య‌యా ప్ర‌యాస‌ల‌కోర్చి అంజి షూటింగ్ పూర్తి చేసి ఎట్ట‌కేల‌కు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చిరుకు జోడీగా చేసిన న‌మ్ర‌త ఆరేళ్ల టైంలో ఎప్పుడు పిలిచినా షూటింగ్‌కు హైద‌రాబాద్‌కు వ‌చ్చేద‌ట‌.

ఎన్నిసార్లు పిలిచినా ఏ మాత్రం కోపం లేకుండా ముంబై నుంచి హైద‌రాబాద్ రావ‌డం.. నాలుగైదు రోజులు షూటింగ్ చేయ‌డం.. వెళ్లిపోవ‌డం.. మ‌ళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వ‌చ్చి షూటింగ్ చేయ‌డం.. ఇలా ఐదేళ్ల పాటు ఓ హీరోయిన్‌.. అప్ప‌టికే ఆమె మిస్ ఇండియా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా..! న‌మ్ర‌త ఎంతో ఓర్పుతో కోప‌రేట్ చేయ‌డం చిరంజీవికి బాగా న‌చ్చేసింద‌ట‌.

అందుకే ఒక సంద‌ర్భంలో న‌మ్ర‌త అంజి సినిమా విష‌యంలో ఎంతో విన‌మ్రంగా కోప‌రేట్ చేసింద‌ని.. ఆమె ఓపిక‌కు, సహ‌నానికి హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. ఇక తెలుగులో న‌మ్ర‌త తొలి సినిమా మ‌హేష్‌బాబు వంశీతో పాటు అంజి సినిమాలు చేశాక మ‌హేష్‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news