Moviesఇక్కడ మీరు చూస్తున్న ఈ విలన్ భార్య ఎవరో తెలుసా..? ...

ఇక్కడ మీరు చూస్తున్న ఈ విలన్ భార్య ఎవరో తెలుసా..? తెలుగులో టాప్ హీరోయిన్..!

బాబీ సింహ .. ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం జనాలు కూసింత కష్టమే . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పాపులారిటీ సంపాదించుకున్న రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా చిత్రంలో విలన్ పాత్ర పోషించి మెప్పించిన నటుడు అనగానే అందరికీ టక్కున గుర్తొస్తుంది . అంతకు ముందు పలు సినిమాలో నటించిన కూడా ఆయనకు ఈ సినిమా ద్వారానే బాగా పాపులారిటి దక్కింది .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న అతని పేరే బాబీ సింహ. టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ హైదరాబాదులోని పుట్టి పెరిగాడు . అయితే అనుకోకుండా ఆయన పేరెంట్స్ తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్ పరిసర ప్రాంతానికి వలస వెళ్లడంతో అక్కడే సెటిల్ అయిపోయారు . అక్కడ నటుడుగా గుర్తింపు పొందారు. కాగా పలు సినిమాలలో తనదైన స్టైల్ లో నటించి గుర్తింపు సంపాదించుకున్న బాబీ సింహ భార్య ఒక హీరోయిన్ అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు .

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా చేసిన హైదరాబాద్ లవ్ స్టోరీ అనే సినిమాలో బాబీ సింహ భార్య రేష్మి మీనన్ హీరోయిన్గా నటించింది. అలాగే సాయిరాం నటించిన “నేనొరకం” అనే చిత్రంలో కూడా హీరోయిన్గా నటించింది రేష్మి మీనన్.. రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అవ్వడంతో ఆమె పేరు పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది . అయితే అందం పరంగా మాత్రం స్టార్ హీరోయిన్స్ ని మించిపోయా రేంజ్ లో ఉంటుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన రేష్మి మీనన్ పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. బాబీ సింహా రేష్మి మీనన్లది ప్రేమ వివాహం. ప్రెసెంట్ వీళ్లు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news