Moviesతల్లి బంగారం తాకట్టు పెట్టి మరీ స్టార్ గా మారిన డైరెక్టర్...

తల్లి బంగారం తాకట్టు పెట్టి మరీ స్టార్ గా మారిన డైరెక్టర్ ఇతనే.. ఎంత లక్కి అంటే..?

సినిమా ఇండస్ట్రీ లోకి రావాలి అని.. తమకున్న కలను నెరవేర్చుకోవాలని చాలామందికి ఆశగా ఉంటుంది . హీరోగా కావచ్చు.. హీరోయిన్గా కావచ్చు.. డైరెక్టర్గా కావచ్చు.. టార్గెట్ ఏదైనా సరే సక్సెస్ అయితే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్ నెలకొన్నదో మనకు తెలిసిందే. కోట్లు ఉంటే కానీ కళ్ళకు కనిపించని స్థితి నెలకొంది. అలాంటిది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్ గా హిట్ కొట్టడం అంటే మాటలు కాదు .

ఆ లిస్టులోకే వస్తాడు శేఖర్ . సునీత కొడుకు సర్కారు నౌకరి సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శేఖర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు. సునీత కొడుకు ఆకాష్ హీరోగా నటించిన సర్కారు నౌకరి సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే శేఖర్ పేరు మారుమ్రోగిపోతుంది. రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శేఖర్ తన ఫైనాన్షియల్ పొజిషన్ గురించి బయటపెట్టాడు .

“2006వ సంవత్సరంలో జేఎన్టీయూ ఫైనాన్స్ కోర్సులో జాయిన్ అయ్యానని.. ఆ టైంలో ఫీజ్ కూడా చెల్లించుకోలేని పరిస్థితులు ఉన్నాయని ..అప్పుడే ఫీజు కట్టడానికి వేరే గతిలేక మా అమ్మ బంగారం తాకట్టుపెట్టి మరి ఫీజు కట్టానని.. అంతేకాకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చేతికి డబ్బులు సంపాదించుకున్నానని.. ఆ తర్వాత వైయస్సార్ అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ స్కీం ప్రవేశపెట్టారని.. అది తనకు చాలా ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు”. ప్రజెంట్ శేఖర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news