Moviesమ‌హేష్ కోసం ఆ హీరోయినే కావాల‌ని ప‌ట్టుబ‌డుతోన్న‌రాజ‌మౌళి.. ఎవ‌రో తెలిస్తే ఫ్యీజులు...

మ‌హేష్ కోసం ఆ హీరోయినే కావాల‌ని ప‌ట్టుబ‌డుతోన్న‌రాజ‌మౌళి.. ఎవ‌రో తెలిస్తే ఫ్యీజులు ఎగురుతాయ్‌..!

కొత్త ఏడాది వచ్చేసింది. సంక్రాంతికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎప్పుడు ? షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ మహేష్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో అయిన మహేష్, రాజమౌళి సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్లు బయటకు వస్తాయని ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

మార్చిలో ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇది ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్గా సాగుతుందని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం అని.. పైగా ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతూ ఉండడంతో ఈ హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి.. ప్రియాంక చోప్రాతో రెండుసార్లు చర్చలు కూడా జరిపినట్టు సమాచారం.

ఇటీవల ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ సినిమా కథ గురించి మాట్లాడుతూ.. నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్‌కు పెద్ద అభిమానులం.. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఏది ఏమైనా రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news