Newsఐటెం సాంగ్ లో వైష్ణవి చైతన్య.. స్వయంగా కాల్ చేసి అడిగిన...

ఐటెం సాంగ్ లో వైష్ణవి చైతన్య.. స్వయంగా కాల్ చేసి అడిగిన స్టార్ హీరో.. ఇక కెవ్వు కేక..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య పేరు ఈ మధ్యకాలంలో ఎలా మారుమ్రోగిపోయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా అమ్మడుకు సంబంధించిన వార్తలు జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలలో సైన్ చేసింది అంటూ కూడా వార్తలు వినిపించాయి .

సీన్ కట్ చేస్తే ఇప్పటివరకు ఆమె ఒక సినిమాకి తప్పిస్తే మరి ఏ సినిమాకి సైన్ చేయలేదు అన్న విషయం క్లారిటీ వచ్చింది . వైష్ణవి చైతన్య ఓ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చేసింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . హీరో రామ్ పోతినేని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా డబల్ ఇస్మార్ట్ . నిజానికి ఈ సినిమాలో ఆమెను రెండో హీరోయిన్గా చూస్ చేసుకోవాలనుకున్నారట.

కానీ ఆమె క్రేజ్ తగ్గిపోవడంతో ఆమెను ఐటం గర్ల్ గా చూస్ చేసుకున్నారట . స్వయాన రామ్ కాల్ చేసి అడగడంతో వైష్ణవి చైతన్య కాదనలేక పోయిందట . త్వరలోనే ఈ సాంగ్ షూట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్లాన్ చేస్తున్నారట . దీంతో హీరోయిన్ అయిపోదామనుకున్న నువ్వు ఆఖరికి ఐటమ్ గర్ల్ అయ్యావా అంటూ మండిపడుతున్నారు జనాలు. మరికొందరు అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అంటూ ఆమెను పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news