Newsమంచు విష్ణు , మ‌నోజ్ గొడ‌వ‌లో మ‌రో ట్విస్ట్‌.... ఇదేం ప‌నిరా...

మంచు విష్ణు , మ‌నోజ్ గొడ‌వ‌లో మ‌రో ట్విస్ట్‌…. ఇదేం ప‌నిరా నాయ‌నా…!

టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు వారసులు మంచువిష్ణు, మంచు మనోజ్ ఇద్దరు హీరోలుగా కొనసాగుతున్నారు. ఇటీవల మనోజ్ నంద్యాల జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది వీరిద్దరికీ కూడా రెండో వివాహం. అయితే ఇటీవల విష్ణు – మనోజ్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక దశలో మనోజ్ కు చెందిన మనుషులపై మంచువిష్ణు దాడికి దిగిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మనోజ్ కూడా దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే తండ్రి మోహన్ బాబు రంగంలోకి దిగడంతో వెంటనే ఆ వీడియోను తొలగించినా అప్పటికే అది వైరల్ అయిపోయింది. అన్నదమ్ముల గొడవపై మంచి విష్ణును మీడియా ప్రశ్నిస్తే దానిని అతడు లైట్ తీసుకున్నాడు. అయితే తాజాగా చాలా గ్యాప్ తర్వాత మనోజ్ మీడియా ముందుకు వచ్చాడు. టీవీ షో నిర్వహించబోతున్న మనోజ్ దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడు.

మైక్ అందుకున్న మీడియా ప్రతినిధి గతంలో మంచు విష్ణుతో జరిగిన గొడవపై ప్రశ్నించపోయాడు. దానిపై మనోజ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే వెనుక నుంచి మనోజ్ స్టాప్ వచ్చి ఆ జర్నలిస్టు దగ్గర నుంచి మైక్ లాక్కున్నాడు. అప్పటికి ఆ జర్నలిస్టు తాను గొడ‌వ‌ గురించి ప్రశ్నించడం లేదని ప్రశ్నా పూర్తయ్య‌యే వరకు ఆగాలని కోరినా సదరు పిఆర్ఓ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ జర్నలిస్టు చేతిలో నుంచి వెంటనే మైకు లాక్కున్నాడు.. దీనిపై మీడియా జనాలు ఫీల్ అవుతున్నారు.

ఆ జర్నలిస్టు చెప్పే విషయం పూర్తిగా వినకుండానే మనోజ్ పిఆర్ఓ అలా చేయటం సరికాదని కొందరు అంటున్నారు. ఇక వాస్తవం ఎలా ఉన్నా ? మంచి విష్ణు మనోజ్ మధ్య జరిగిన గొడవ మాత్రం చాలా పెద్దద‌న్న‌ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఒక దశలో ఇది ఆస్తి పంపకాల వరకు వెళ్లిందని మోహన్ బాబు సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనిపించడం కూడా ఇందులో భాగమే అన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబుతో పాటు ఆ కుటుంబానికి చెందిన కొందరు సన్నిహితులు రంగంలోకి దిగటంతో తాత్కాలికంగా మనోజ్ – విష్ణు మధ్య గొడవ సర్దుమడిగినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news