Newsటాలీవుడ్ చరిత్రలోనే అలాంటి వార్ ఎప్పుడు జరగలేదా.. చరిత్రలో నిలిచిన బాలయ్య...

టాలీవుడ్ చరిత్రలోనే అలాంటి వార్ ఎప్పుడు జరగలేదా.. చరిత్రలో నిలిచిన బాలయ్య విక్ట‌రీ..!

టాలీవుడ్ లో సంక్రాంతికి ఒకేసారి 3 – 4 పెద్ద సినిమాలు థియేటర్లలోకి దిగుతూ ఉంటాయి. ఒకేసారి స్టార్ హీరోల‌ సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటే ఆ మజా వేరుగా ఉంటుంది. 2016 సంక్రాంతికి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, శర్వానంద్ సినిమాలు నాలుగు బాక్సాఫీస్ దగ్గర పోటీపడి బాక్సాఫీస్ ను హీటెక్కించాయి. ఆ నాలుగు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి కూడా బాలయ్య, చిరంజీవి సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. టాలీవుడ్‌లో చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ అయితే ఆ మజా మామూలుగా ఉండదు.

ఇప్పుడే ఇలా ఉంది అంటే.. అసలు 20 సంవత్సరాల క్రితం చిరంజీవి – బాలయ్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే తెలుగు బాక్స్ ఆఫీస్ వేడెక్కిపోయి ఉండేది. పల్లెటూర్లలో ఆయా హీరోల అభిమానులు.. తమ హీరో సినిమా సూపర్ హిట్ అవుతుందని నెలరోజుల ముందు నుంచి చర్చల్లో మునిగిపోయేవారు. అరుగుల మీద కూడా ఇదే డిస్కషన్ నడిచేది. ఇక సినిమా రిలీజ్ రోజు జరిగే హంగామా మామూలుగా ఉండేదే కాదు. టాలీవుడ్ లో 2001 సంక్రాంతి కానుకగా అప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఒకేసారి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి.

ఈ మూడు సినిమాలలో గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మృగరాజు సినిమా తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ చేసిన దేవి పుత్రుడు సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. వరుస ఫ్లాపులో ఉన్న బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాపై రిలీజ్ కి ముందు అంత అంచనాలు లేవు. ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించారు. రిలీజ్‌కు ముందు చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాకు ఎక్కువ ధియేటర్లు దక్కాయి. నరసింహనాయుడు సినిమాకు చాలా లిమిటెడ్ థియేటర్లు మాత్రమే వేశారు.

జనవరి 11న నరసింహనాయుడు, మృగరాజు సినిమాలో ఒకేరోజు రిలీజ్ కాగా.. జనవరి 14న వెంకటేష్ దేవీ పుత్రుడు సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఒకే సంక్రాంతి కానుకగా మూడు పెద్ద హీరోలు సినిమాలు థియేటర్లలోకి దిగడంతో.. ఆంధ్ర ప్రదేశ్ మొత్తం పెద్ద సినిమాలతో కలకలలాడిపోయింది. విచిత్రం ఏంటంటే ఈ మూడు సినిమాలకు మణిశర్మ సంగీత దర్శకుడు కావడం విశేషం. అలాగే మృగరాజు, నరసింహనాయుడు రెండు సినిమాలలోనూ సిమ్రాన్ హీరోయిన్. చిరంజీవి మృగరాజు సినిమా ఆయన కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది.

నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. కొన్నిచోట్ల ఈ సినిమా ఏడాది పాటు ఆడింది. అటు దేవీపుత్రుడు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని భారీ బడ్జెట్ కావడంతో నష్టాలు మిగిల్చింది. అలా టాలీవుడ్ లో ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడిన సినిమాలో చిరంజీవి, వెంకటేష్ పై బాలయ్య తిరుగులేని విజయం సాధించారు. ఈ విజయం బాలయ్య కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ సంక్రాంతి హిస్టరీలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news