Newsసావిత్రి మహానటి గా మారడానికి ఆ జంతువులు పెంచుకుందా..? ఎవ్వరికీ తెలియని...

సావిత్రి మహానటి గా మారడానికి ఆ జంతువులు పెంచుకుందా..? ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ బయటపడింది గా…!

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడి ఆరాధించే నటీమణులలో దివంగత సీనియర్ నటిమని సావిత్రి ఒకరు. సావిత్రి తెలుగు అమ్మాయి.. సావిత్రి స్వస్థలం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలోని చిర్రావూరు. సావిత్రి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నుంచి తిరుగులేని స్టార్ హీరోయిన్ అయింది. మూడు దశాబ్దాలకు పైగా హీరోయిన్గా స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఇండస్ట్రీని శాసించారు. ఇటు తెలుగుతోపాటు.. అటు తమిళంలోనూ అందరూ స్టార్ హీరోల సినిమాలలో నటించిన‌ సావిత్రి అంటే అప్పట్లో సినీ అభిమానుల ఆరాధ్య దేవతగా కీర్తించబడ్డారు.

తన అందం, అభినయం, నటన, నైపుణ్యంతో లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ సావిత్రి అంటే అభిమానించే వారి సంఖ్య ఎంతో ఉంది. కొన్నేళ్ల క్రితం సావిత్రి బయోపిక్ మహానటి సినిమా వస్తే తెలుగు, తమిళ సినీ జనాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ చేశారో చూశాము. కెరీర్‌ ఫామ్‌లో ఉండగానే సావిత్రి తమిళ్ స్టార్ హీరో జెమినీ గణేషన్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయనకు ఒక పెళ్లి అవ్వడంతో పాటు పుష్పవల్లితో ఎఫైర్ కూడా ఉంది. ఇవన్నీ తెలిసి కూడా సావిత్రి జెమినీ జీవితంలోకి వెళ్లి పెద్ద తప్పు చేసింది.

కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించిన సావిత్రి తన స్థాయికి మించి విపరీతంగా దానధర్మాలు చేయడం, జెమినీ గణేష్ తో ఏర్పడిన విభేదాలు ఇవన్నీ ఆమెను ఆర్థికంగాను, కెరీర్ పరంగాను పత‌నావ‌స్థకు తీసుకువెళ్లాయి. సావిత్రి పెంపుడు జంతువులను ఆసక్తిగా పెంచే వారట. ఆమె కుక్కలతో పాటు ఒక చిన్న చిరుతపులిని కూడా ఇష్టంగా పెంచుకున్నారు. సావిత్రి చిరుత పులితో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పట్లో సావిత్రి చిరుతను పెంచుకోవడం కూడా చెన్నైలో పెద్ద సెన్సేషనల్‌గా ఉండేది. సావిత్రి విపరీతంగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయటం కూడా చివర్లో ఆమె ఆర్థికంగా పతనం అవటానికి కారణం అని చెబుతూ ఉంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news