Newsసుమ-రాజీవ్ విడాకుల ఇష్యూ పై బోల్డ్ గా మాట్లాడిన రోషన్.. ఈ...

సుమ-రాజీవ్ విడాకుల ఇష్యూ పై బోల్డ్ గా మాట్లాడిన రోషన్.. ఈ రేంజ్ ఆన్సర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అంతకుమించిన స్టార్ పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆమె పలు విషయాలు కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగి గురవడం మనం చూస్తూనే ఉన్నాం. కాగా రీసెంట్గా సుమ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బబుల్గం అనే సినిమా ద్వారా ఆయన తెలుగు చలనచిత్రపై కనివిందు చేయబోతున్నాడు .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోషన్ ఫ్యామిలీకి సంబంధించిన బోలెడన్ని విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే సుమ రాజీవ్ కనకాల విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు రావడం పై కూడా స్పందించారు. ” నేను కూడా ఇలాంటి వార్తలు చాలా చదివాను.. మొదట్లో చాలా కంగారు పడ్డాను ..మా అమ్మ నాన్న విడాకులు తీసుకుంటున్నారా ..? ఇది ఎప్పుడు ..?నాకు తెలియకుండా ఇది ఎప్పుడు జరుగుతుంది ..?అంటూ షాక్ అయిపోయాను “.

“ఆ వార్త చదువుతున్న టైం లోనే పక్కన మా అమ్మ నాన్న హ్యాపీగా కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. సరే ధైర్యం చేసుకునే ఆ విషయాన్ని నేను అడిగేసాను . ఏంటి మీరు విడాకులు తీసుకుంటున్నారా..? అని అప్పుడు మా నాన్న ఏం మాట్లాడుతున్నావ్ రా.. అలాంటిదేమీ లేదు అదంతా ఫేక్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా మూడు నాలుగు సార్లు ఇలాంటి వార్తలు చూశాను. అప్పుడే అర్థమైంది ఇదంతా ఎవరో కావాలనే పుట్టిస్తున్న పుకార్లు అని అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టాడు రోషన్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news