Newsయూఎస్‌లో ' స‌లార్ ' వీరంగం... సెక‌న్ సెక‌న్‌కు రికార్డులు పేలుతున్న‌య్‌...!

యూఎస్‌లో ‘ స‌లార్ ‘ వీరంగం… సెక‌న్ సెక‌న్‌కు రికార్డులు పేలుతున్న‌య్‌…!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించిన భారీ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్‌ సలార్. ఈ సినిమా థియేటర్లోకి వచ్చేందుకు మరో ఆరు రోజులు టైం మాత్రమే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది సినిమాపై మామూలుగా హైప్ లేదు. దేశం మొత్తం సలార్ నామస్మరణతో మారుమోగిపోతుంది. ప్రభాస్ గత సినిమాల కంటే అంచనాలు ఇంత ఆకాశంలో ఉండటానికి ఈ సినిమా దర్శకుడు, నిర్మాణ సంస్థ, సినిమాలో నటీనటులు కూడా ప్రధాన కారణం.

హైవోల్టేజ్ యాక్షన్.. కమర్షియల్ ఎంటర్టైనర్ గా సలార్ సినిమా తెరకెక్కింది. ప్రభాస్‌కు జోడిగా శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కేజీఎఫ్ సీరియస్ సినిమాలతో.. దేశం మొత్తం కన్నడ సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తుండడంతో సలార్ మానియా మామూలుగా లేదు. ఇప్పటికే ఇండియాలో సలార్ నామస్మరణ జరుగుతుంటే.. అటు యూఎస్ బుకింగ్స్ చూస్తుంటే.. సలార్‌ మాస్ ర్యాంపేజ్‌ చూపిస్తోంది.

లేటెస్ట్‌గా సలార్ ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 8 లక్షల డాలర్ల మార్క్ చేరుకుంది. జస్ట్ ఫ్రీ సేల్స్‌లోనే.. అది కూడా సినిమా రిలీజ్ ముందే ఈ స్థాయిలో వసూళ్లకు వచ్చాయి అంటే.. సినిమా రిలీజ్ డే నాటికి కేవలం ఫ్రీ సేల్స్ 2.5 నుంచి 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యుఎస్ మార్కెట్లో సలార్ హైప్‌ సెకండ్.. సెకండ్ కి పెరిగిపోతుంది. ఈ భారీ బడ్జెట్ సినిమానికి రవి బస్రూర్‌ సంగీతం అందించగా హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్‌ నిర్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news