Movies' స‌లార్ ' వ‌ర‌ల్డ్ వైడ్ టార్గెట్ ఎన్ని వంద‌ల కోట్లో...

‘ స‌లార్ ‘ వ‌ర‌ల్డ్ వైడ్ టార్గెట్ ఎన్ని వంద‌ల కోట్లో తెలుసా… క‌ళ్లు తిరిగి ప‌డ‌తాం…!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులతో పాటు ప్రజలు అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో సలార్ థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ బిజినెస్ జరిగింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. సలార్ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఏకంగా రూ.800 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు రాబట్టాలి.

ఏరియాల వారీగా చూస్తే తెలంగాణలో సలార్ మూవీ రైట్స్ రూ.65 కోట్లకు అమ్ముడయ్యాయి. మరో రూ.25 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ కూడా ఉంది. మొత్తం రూ.90 కోట్లకు సలార్ తెలంగాణ బిజినెస్ జరిగింది. కనీసం రూ.65 కోట్లు షేర్ రావాలన్న రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ఏపీలో సలార్ థియేటర్ రైట్స్ రూ.95 కోట్లు అమ్మకాలు జరిగాయి. అక్కడ ఈ సినిమా రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో సలార్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.250 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది.

కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇతర దక్షిణాది రాష్ట్రాలలో సలార్ నిర్మాతలు సొంతంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అక్కడ బిజినెస్ ప్రకారం చూసుకుంటే ఈ మూడు రాష్ట్రాలకు కలిపి రూ.65 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూడు రాష్ట్రాలలో రూ.130 కోట్ల గ్రాస్ వస్తేనే సలార్‌ బ్రేక్ ఈవెన్ అయినట్లు. ఇక ప్రపంచ వ్యాప్తంగా సలార్ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.800 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు రావాలి. టోటల్‌గా సౌత్ ఇండియా నుంచి ఈ సినిమా రూ.380 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నార్త్ ఇండియా బిజినెస్ లెక్కల ప్రకారం అక్కడ బ్రే క్ ఈవెన్ కావాలంటే రూ.230 కోట్ల గ్రాస్ రావాలి.

సౌత్, నార్త్ రెండు కలిపితే ఇండియా వైడ్‌గా రూ.610 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలి. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే ఈ సినిమా పబ్లిసిటీ ప్రింట్ ఖర్చులతో కలిపి రూ.75 కోట్లకు అమ్ముడు అయింది. అక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.150 కోట్ల గ్రాస్ రావాలి.. అలా మొత్తం వరల్డ్ వైడ్గా ఈ సినిమా రూ. 800 కోట్ల గ్రాస్.. రూ.400 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. భారీ రిలీజ్ బిజినెస్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ప్రభాస్ ఈ భారీ టార్గెట్ చేదించి నిర్మాతకు లాభాలను ఎలా అందిస్తాడు అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news