News"సమంత చెప్తేనే అలా చేశాను".. సంచలన విషయాని బయటపెట్టిన రంగస్ధలం నటుడు..!!

“సమంత చెప్తేనే అలా చేశాను”.. సంచలన విషయాని బయటపెట్టిన రంగస్ధలం నటుడు..!!

సినిమా ఇండస్ట్రీలో బాగా జనాలు గుర్తుపెట్టుకునేది హీరో హీరోయిన్ లని..డైరెక్టర్ ప్రొడ్యూసర్ లని.. మహా అయితే ఆ సినిమాను నిర్మించే మేకర్స్ సంస్థ… ఇంతే వీళ్ళ వరకే గుర్తుపెట్టుకుంటారు. మహా ఎక్కువైతే బాగా పాపులారటి సంపాదించుకున్న కొంతమంది యాక్టర్స్ . అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి పలు సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నాగ మహేష్ పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేరు ఏమో కానీ ముఖం చూస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. రంగస్థలం సినిమాతో బాగా పాపులారిటి దక్కించుకున్న ఈయన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించడం కారణంగానే రంగస్థలం సినిమాలో ఆఫర్ వచ్చిందట . రీసెంట్ గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన లైఫ్ గురించి .. తన సినీ కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .

అంతేకాదు అసలు రంగస్థలం సినిమాలో తనకు ఆఫర్ ఎలా వచ్చింది అనే విషయాన్ని చెబుతూ హీరోయిన్ సమంత మంచితనం గురించి బయట పెట్టాడు . ఈ సినిమాలో ఆయనను మొదటిగా పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నారట . అయితే ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆయన్ను ఈరోల్ కి చూస్ చేసుకున్నారట. ఈ సినిమాలో ఒక సీన్లో భాగంగా ఆయన సమంత చేయి పట్టుకొని గట్టిగా లాగి వెళ్ళాల్సి ఉంటుంది .

అయితే “ఆవిడ పెద్ద హీరోయిన్ ..నేను అలా చేయ పట్టుకుంటే ఏమనుకుంటారో ఏమో అని పట్టుకున్నట్లు యాక్ట్ చేశాను.. కానీ సమంత పర్వాలేదు మీరు గట్టిగా చేయి పట్టుకొని లాగండి నాకు ఇబ్బంది లేదు అంటూ నాకు ఎంతో హెల్ప్ చేసింది ..ఆ సీన్ బాగా వచ్చేలా చేసింది .. అందుకే ఆ సినిమా అంత సక్సెస్ అయ్యింది ” అంటూ సమంతలోని మంచితనాన్ని బయట పెట్టాడు నాగ మహేష్ . ప్రజెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news