Moviesచరణ్ - తారక్ - బన్నీ - ప్రభాస్.. 2023లో ఏ...

చరణ్ – తారక్ – బన్నీ – ప్రభాస్.. 2023లో ఏ హీరోకి దక్కని అరుదైన ఘనతను అందుకున్న హీరో నాని ఒక్కడే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే 2023 మాత్రం ఒక్క టాలీవుడ్ హీరోకే కలిసి వచ్చింది . ఆయనే నాని నాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని 2023 లక్కీ హీరో అనే చెప్పాలి. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించి ..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి .. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఫీలిం లు చేస్తూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు నాని .

కాగా 2023 లో చాలామంది పెద్దపెద్ద హీరోలు నటించిన సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ నేచురల్ స్టార్ నాని అందుకున్న రికార్డ్ మరి ఏ హీరో అందుకోలేకపోయాడు . ఈ ఏడాదిలో నాచురల్ స్టార్ నాని రెండు సినిమాల్లో నటించాడు . మొదటగా “దసరా” సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్గా “హాయ్ నాన్న” సినిమాతో మరో కూల్ అండ్ ఎమోషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

హాయ్ నాన్న కలెక్షన్స్ పరంగా ఇబ్బంది పెట్టిన టాక్ పరంగా మాత్రం చాలా ఎక్కువగానే పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నింది. అయితే ఇద్దరు కూడా కొత్త డైరెక్టర్లే కావడం గమనార్హం. ఇద్దరు కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళ డైరెక్షన్లో సినిమాలో నటించి అది కూడా హిట్ తన ఖాతాలో వేసుకోవడం నానికే చెల్లింది . అందుకే నాని 2023 లక్కీ స్టామినా టాలెంటెడ్ హీరోగా నిలిచిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news