Newsహీరోయిన్ మోజులో ప‌డి పిచ్చోడైపోయిన టాలీవుడ్ టాప్ రైట‌ర్‌...!

హీరోయిన్ మోజులో ప‌డి పిచ్చోడైపోయిన టాలీవుడ్ టాప్ రైట‌ర్‌…!

కులశేఖర్..సూపర్ హిట్ సాంగ్స్ రాసిన ప్రముఖ గీత రచయిత. వెంకటేశ్ నటించిన ఘర్షణ సినిమాలో పాటలే కాదు..ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా కులశేఖర్ రాసినవే. ఒక్క సీన్ డైలాగ్స్ చూసిన వెంకటేశ్ స్వయంగా నువ్వే ఈ సినిమాకి డైలాగ్స్ రాసేయ్ అనడంతో ఘరణ సినిమాకి మాటలు అందించారు. కానీ, ఆయన చేసిన కొన్ని పొరాట్ల వల్ల ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు.

కొందరేమో దొంగ అంటూ మాట్లాడారు. కొందరేమో పిచ్చివాడైపోయాడని అన్నారు. దీనికి కారణం ఒక హీరోయిన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో కొందరున్నారు. కులశేఖర్ పుట్టింది సింహాచలం. ఆయనకి చిన్నప్పటి నుంచి సంగీత, సాహిత్యాల మీద ఎక్కువగా ఆసక్తి ఉండేది. చదువుకుంటున్న రోజుల్లో పాటలు రాసి బహుమతులు కూడా అందుకున్నాడు.

ఆ టాలెంట్ వల్లే దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్.పీ పట్నాయక్ పరిచయమయ్యారు. వీరి కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ వచ్చాయి. కులశేఖర్ ఘరణ సినిమా వరకూ దాదాపు 100 సినిమాలకి పాటలు రాశారు. అప్పట్లో చాలామంది కులశేఖర్ పాట కావాలని అడిగేవారట. అయితే, ఒక హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటూ ఏకంగా షూటింగ్ స్పాట్ నుంచే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడట.

అదే ఆయన కెరీర్ ని చిక్కుల్లో పడేసిందట. ఒక సందర్భంలో చేత్లో డబ్బుల్లేక గుడిలో బంగారు ఆభరణాలేవో దొంగిలించాడని పోలీసులు పట్టుకెళ్ళారట. ఇలాంటి సమస్యల వల్ల మానసికంగా కులశేఖర్ కృంగిపోయి మతి స్థిమితం లేకుండా పోయిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఎలాంటి అద్భుతమైన కెరీర్..కేవలం అమ్మాయి మీద వ్యామోహంతో నాశనం చేసుకున్నాడని ఆయన మంచి కోరే వారు అంటుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news