Movies"మీకు ఏంట్రా నొప్పి..?"..బాలయ్య తోసేసిన ఇష్యూ.. సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసిన...

“మీకు ఏంట్రా నొప్పి..?”..బాలయ్య తోసేసిన ఇష్యూ.. సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసిన అంజలి(వీడియో)..!

సోషల్ మీడియాలో బాలయ్య కు సంబంధించిన ఒక వీడియో ఎలా ట్రెండ్ అవుతుందో వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాము. మాస్ కా దాస్ గా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య హీరోయిన్ అంజలి పై ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది . అఫ్కోర్స్ బాలయ్య అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి అదంతా కామన్ గానే ఉన్న కావాలని కొంతమంది దాన్ని ద్వందార్థాలు తీస్తూ ట్రోల్ చేస్తున్నారు .

సరదాగా ఫ్రెండ్స్ ఆటపట్టించేటప్పుడు అలా తోసేస్తూ ఉంటారు.. మనం కూడా చాలా సార్లు అలా బిహేవ్ చేసి ఉంటాం. కానీ మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ కౌంటింగ్ అని తెలిసి కొంతమంది ఆయనను దారుణంగా ట్రోల్ చేయడానికి ఈ విధంగా ఈ వీడియోని వాడుకుంటున్నారు. కొంతమంది ఆయనను చాలా చాలా దారుణంగా తిడుతున్నారు కూడా.. దీంతో సోషల్ మీడియాలో పలువురు బాలయ్య ఫ్యాన్స్ పలువురు హీరోలు ఆయనకు సపోర్ట్ చేస్తూ మెసేజెస్ పెడుతున్నారు.

ఇప్పటికే ప్రొడ్యూసర్ నాగ వంశీ అదేవిధంగా హీరో విశ్వక్సేన్ ఆ విషయంలో బాలయ్య తప్పులేదు కావాలని ట్రోల్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. తాజాగా హీరోయిన్ అంజలి సైతం ఒక సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసింది. ” బాలయ్య గారితో నాకున్న సంబంధం.. నాకున్న రిలేషన్ ..నాకున్న చనువు అన్ని నాకు తెలుసు. మేమిద్దరం ఎప్పుడూ ఒకరి పట్ల ఒకరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూనే ఉంటాం. చాలా సరదాగా ఫ్రెండ్స్ గా ఉంటాం అంటూ బాలయ్య ఆమెతో కలిసి ఉన్న కొన్ని రేర్ పిక్చర్స్ సరదాగా గడిపిన మూమెంట్స్ తో పాటు తోసేసిన క్లిప్ కూడా యాడ్ చేసింది “. మొత్తానికి అలా తోసేసినందుకు నాకే ప్రాబ్లం లేదు.. నీకేంటి రా నొప్పి అన్న రేంజ్ లో అంజలి ఇచ్చి పడేసింది . ప్రెసెంట్ ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news