Newsక‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌ను ప్రేమించి మోసం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌...!

క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌ను ప్రేమించి మోసం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌…!

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అంటే రెండున్నర దశాబ్దాల క్రిందట సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఒక పిచ్చి. ఉపేంద్ర స్టైల్, ఉపేంద్ర తీసే సినిమాలు యువతకు మంచి కిక్ ఇచ్చాయి. ఏ – రా – ఉపేంద్ర, హాలీవుడ్ ఇలా ఉపేంద్ర చేసినవి అన్ని ప్రయోగాత్మక సినిమాలే. డైరెక్ట్ గా తెలుగులోను కన్యాదానం, ఒకే మాట సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఉపేంద్ర అప్పట్లో కన్న‌డంలో తిరుగేలేని సూపర్ స్టార్‌గా ఒక వెలుగు వెలిగారు. ఆ టైంలోనే ఉపేంద్ర ఓ ప్రముఖ నటితో ప్రేమలో పడ్డారు.

ఇద్దరు కలిసి పిచ్చిపిచ్చిగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు.
అంతలో ఏమైందో కానీ ఆమె ఉపేంద్ర‌కు హ్యండ్‌ ఇవ్వటంతో ఉపేంద్ర పిచ్చివాడిగా మారిపోయాడు. ఆ నటిమణి ఎవరో ? కాదు కన్నడ అమ్మాయి.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉన్న ప్రేమ. వెంకటేష్ హీరోగా వచ్చిన ధర్మచక్రం సినిమాతో ప్రేమ తెలుగు తెర‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె తెలుగుతో పాటు కన్నడంలోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

ఉపేంద్ర – ప్రేమ ప్రేమించుకున్నారు.. చెట్టాపట్టలేసుకుని తిరిగారు.. కారణం ఏంటో తెలియదు గానీ ప్రేమ.. ఉపేంద్రను పక్కన పెట్టేసింది. ప్రేమ లేకపోతే తాను ఉండలేను అనుకున్న ఉపేంద్ర ఎంతో వేదనకు గురయ్యారు. ఆమె మోసం చేసిందని తీవ్ర ఆవేదనకు గురవడంతో ఇటు కెరీర్ పరంగా కూడా వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. కెరీర్ మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఆ టైంలో మరో హీరోయిన్ ఉపేంద్ర మనసులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో జెడి చక్రవర్తి హీరోగా తెరకెక్కిన సూర్య సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటించింది.

ఉపేంద్రతో కలిసి నటిస్తున్న సమయంలో వారిద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అలా ప్రేమ వల్ల ఎదురైన చేదుగాయాలను ప్రియాంకతో.. ఉపేంద్ర నయం చేసుకొని ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. ఇక తాజాగా ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం క్యాప్చ‌ర్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తోంది. లోహిత్.హెచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కింది. ప్రస్తుతం ఉపేంద్ర – ప్రియాంక ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news