Newsఛాన్సుల కోసం క‌మిట‌య్యారా... ఎస్ అని ఒప్పుకున్న శ్రీలీల‌...!

ఛాన్సుల కోసం క‌మిట‌య్యారా… ఎస్ అని ఒప్పుకున్న శ్రీలీల‌…!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో శ్రీలీల ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఏడాది నుంచి చేతినిండా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటుంది ఈ క్యూట్ బ్యూటీ. చిన్న సినిమా అయిన పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఈ చిన్నది ఇప్పుడు అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని స్థాయికి వెళ్ళిపోయింది. ఇదంతా కేవలం నాలుగైదు సినిమాలకే జరిగిపోయింది. కొద్ది రోజుల క్రితమే బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాలో అందరికీ గుర్తుండిపోయే పాత్రలో మెప్పించిన శ్రీలీల.. అంతకుముందు రవితేజ ధమాకా సినిమాలోని సూపర్ హిట్ కొట్టింది.

ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్, మెగా హీరో వైష్ణవ తేజ్ ఆదికేశవ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రానుంది. దీంతోపాటు సినిమాల షూటింగ్ షెడ్యూలలో బిజీగా ఉంది. ఇంతటి బిజీ షెడ్యూల్ లోను ఈ చిన్నది తన అభిమానులను పలకరించటం అస్సలు మర్చిపోదు. వాళ్ల కోసం సోషల్ మీడియా వేదికల్లో సినిమా అప్డేట్లతో పాటు, లేటెస్ట్ ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి అభిమానులతో ముచ్చటించింది ఈ చిన్నది.

ఈ క్రమంలోనే నెటిజన్లు అడిగిన ప‌లు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చింది. ఒక నెటిజన్ ఈ రోజు బిగ్‌బాస్‌కి వస్తున్నారా ? అని అడగగా దానికి శ్రీ‌లీల‌ స్పందిస్తూ ఆదికేశవ సినిమా ప్రమోషన్ల కోసం వస్తున్నట్టు చెప్పింది. మరో వ్యక్తి ఆర్ యు కమిటెడ్ అని శ్రీ‌లీల‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు. ఆమె సమాధానం సూటిగా చెబుతూ అవును నేను నా పని విషయంలో కమిటెడ్ గానే ఉంటాను. అని అదిరిపోయే కౌంటర్ ఆన్సర్‌గా ఇచ్చింది. ఇక వైష్ణవ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన ఆది కేశవ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news