Newsచనిపోయినా ఆ విషయంలో చంద్ర మోహన్ రాజే.. ఎవ్వరికి దక్కని అదృష్ట...

చనిపోయినా ఆ విషయంలో చంద్ర మోహన్ రాజే.. ఎవ్వరికి దక్కని అదృష్ట మరణం ..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది . ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందారు. నటుడు చంద్రమోహన్ హీరోగా ..కామెడీ యాక్టర్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి జనాలను మెప్పించారు . అంతేకాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలందించారు చంద్రమోహన్ .

కాగా గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఈయన శనివారం రోజు హైదరాబాదులోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు .ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి . పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. ఇది ఇలా ఉండగా చంద్రమోహన్ మరణించినా కూడా ఆయన జనాల గుండెల్లో ఎప్పుడు రాజే అంటూ ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు .

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఎవరైనా సరే పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ దక్కించుకుంటారు. అయితే చంద్రమోహన్ మాత్రం తన కెరీర్లు ఒక్కటంటే ఒక్క నెగిటివ్ మార్కు లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని నాళ్లు పాజిటివ్ కామెంట్స్ తోనే స్టార్ గా మారాడు . అంతేకాదు ఆయనతో వర్క్ చేసిన హీరో హీరోయిన్లు కూడా ఆయన గురించి తప్పుగా చెప్పిన సందర్భాలు ఎక్కడా లేవు .. చంద్రమోహన్ వీళ్లతో గొడవ వేసుకున్నారు అన్న దాఖలాలు కూడా లేవు. అలా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంత మంచిగా వచ్చారో.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయేటప్పుడు కూడా అంతే మంచిగా వెళ్ళిపోయాడని మరణంలోనూ ఆయన రాజు గానే మరణించారు అని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news