Newsబాల‌య్య 109లో ఫ‌స్ట్ సీన్ ఏదో తెలుసా... ఈ సినిమాకు ఆ...

బాల‌య్య 109లో ఫ‌స్ట్ సీన్ ఏదో తెలుసా… ఈ సినిమాకు ఆ సంవ‌త్స‌రానికి లింక్ ఏంటి ?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ భగవంత్‌ కేసరి సినిమాతో హ్యాట్రిక్‌ విజయం సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కేవలం హ్యాట్రిక్‌ విజయం మాత్రమే కాకుండా ఆఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో రు. 100 కోట్ల క్లబ్లోకి బ్యాక్ టు బ్యాక్ ఎంట్రీ ఇచ్చి సీనియర్ హీరోల‌లో తిరిగులేని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. భగవంత్‌ కేసరి సినిమా ఇంకా థియేటర్లలో దూకుడు చూపిస్తూ ముందుకు వెళుతుంది.

ఈ క్రమంలోనే బాలకృష్ణ కొత్త సినిమాని పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నాడు. బాలయ్య తన నెక్ట్స్‌ మూవీ బాబి తో చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి వాల్తేరు వీరియ్య‌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాబి ఇప్పుడు బాలయ్యకు కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 6 నుంచి మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ యాక్షన్ సీన్‌తో మొదలు పెట్టబోతున్నారు.

20 రోజులు పాటు ఊటీలో కంప్లీట్ గా ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారట. చోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాకి పనిచేయబోతున్నారు. ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీక‌ర ప్రొడ‌క్ష‌న్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చ్యున్ ఫోర్ బ్యాన‌ర్ల‌పై సూర్య‌దేవ‌ర‌ నాగవంశీ, త్రివిక్రం భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కథ విషయానికొస్తే 1980 స్టోరీతో ఉండబోతుందని తెలుస్తోంది. వ‌యెలెన్స్‌కు విజిటింగ్ కార్డు అంటూ ఈ సినిమాను ప్రకటించారు. ప్రపంచానికి ఇతను తెలుసు… కానీ ఇతని ప్రపంచం ఎవరికీ తెలియదు అనే కొటేషన్ తో ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news