Newsబ‌న్నీ సినిమా విష‌యంలో దారుణంగా మోస‌పోయిన శ్ర‌ద్ధాదాస్‌... అస‌లేం జ‌రిగింది...!

బ‌న్నీ సినిమా విష‌యంలో దారుణంగా మోస‌పోయిన శ్ర‌ద్ధాదాస్‌… అస‌లేం జ‌రిగింది…!

ఆర్య 2 సినిమా చేసి శ్రద్దా దాస్ మోసపోయిందా..? అంటే ఈ బ్యూటీ తన సన్నిహితుల వద్ద అదే చెప్పి చాలా సందర్భాలలో ఫీలైందట. శ్రద్దా దాస్ అల్లరి నరేశ్ హీరోగా నటించిన సిద్దూ ఫ్రం శ్రీకాకులం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ కి సంతకం చేసింది. అయితే శ్రద్దా దాస్ చేసిన మొదటి సినిమా వల్ల అవకాశాలు వచ్చాయి గానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేదు.

అదేంటో గానీ అల్లరి నరేశ్ సరసన హీరోయిన్‌గా నటిస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన ఏ అమ్మాయి సక్సెస్ కాలేదు. హీరోయిన్ గా పట్టుమని పది సినిమాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి. శ్రద్దా దాస్ కూడా అంతే..హీరోయిన్ గా మాత్రం కనీసం ఓ పది సినిమాలు చేసింది లేదు. సెకండ్ లీడ్ అని చెప్పి నమ్మించి తన గ్లామర్ ని వాడుకున్న మేకర్స్ చాలామంది ఉన్నారు.

కొన్ని సినిమాలు ఎందుకు చేశానో..? శ్రద్దా దాస్ బాధపడిన సందర్భాలున్నాయట. అలా బాధపడిన సినిమా ఆర్య 2. ఈ సినిమా అల్లు అర్జున్ కి హీరోగా ఈ సినిమా మంచి ప్రేరు తెచ్చింది. కాజల్ అగర్వాల్ మేయిన్ హీరోయిన్ అయినా శ్రద్దా దాస్ గ్లామర్ కి బాగానే ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. కానీ, క్లాసీ వ్యాప్ తరహాలో ఉండే శ్రద్దా దాస్ క్యారెక్టర్ అంతగా పేరు తెచ్చింది లేదు.

పైగా అంత గ్లామర్ గా నటించినప్పటికీ ఎటు తిరిగీ సినిమాలో క్రెడిట్ దక్కించుంది మాత్రం కాజల్ అగర్వాల్ మాత్రమే. సుకుమార్ శ్రద్దా దాస్ క్యారెక్టర్ ని అంత స్ట్రాంగ్ గా రాలేదు. ఏదో అందాలు ఆరబోయడానికి ఓ అమ్మాయి కావాలి..ఫిజిక్ శ్రద్దా దాస్ ది అయితే బావుంటుంది..అందుకే తీసుకున్నారు. చెప్పాలంటే ఆర్య 2 తర్వాత శ్రద్దా దాస్ ఆశించిన సినిమాలు రాకపోగా కెరీర్ బాగా ఎఫెక్ట్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news