Newsఆ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌కు అంత సీన్ లేద‌ని తెలిసి ర‌ష్మిక ఏం...

ఆ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌కు అంత సీన్ లేద‌ని తెలిసి ర‌ష్మిక ఏం చేసిదో చూడండి…!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కెరీర్ కాస్త నత్త నడకన సాగుతుంది. అయితే చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రం క్రేజ్ ఉన్నవే. వాటిలో ఒకటి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించిన పుష్ప చిత్రానికి సీక్వెల్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రష్మిక మందన్న కెరీర్ ఎక్కడికో వెళుతుందని అందరూ భావించారు.

అనుకున్నట్టుగా మంచి సినిమాలు చేసే ఛాన్స్ అందుకుంది. ముఖ్యంగా తెలుగు కంటే హిందీలో వరుసగా సినిమాలు కమిటైంది. కానీ, అక్కడ రష్మిక మందన్నకి ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ దక్కలేదు. ఇప్పుడు రణ్బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేసింది. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు.

అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేస్తుంది. అలాగే, హిందీలో ఇంకో సినిమా ఒప్పుకుంది. ఈ రెండు సినిమాలు కూడా సుకుమార్ పర్మిషన్ తీసుకునే కమిటైంది. యానిమల్ గనక హిందీలో సక్సెస్ సాధిస్తే అక్కడ రష్మిక ని ఇప్పట్లో వదలరు. దీనిలో సందేహమే లేదు. రష్మిక కూడా ఇదే కోరుకుంటుంది.

ఇక తెలుగులో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమా హిట్ అయినా పోయినా పెద్దగా పోయేదేమీ లేదు. దీనికి కారణం నాగార్జునకి భారీ ఫ్లాపిచ్చిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు కాబట్టి. గీతా ఆర్ట్స్ కోసం అల్లు అరవింద్ కోసం ఈ సినిమా ఒప్పుకుంది గానీ, రాహుల్ కథ చెప్పాడని అతనేదో అద్భుతంగా సినిమా తీస్తాడని రష్మిక ఒప్పుకోలేదట. దీనినిబట్టి చూస్తే రష్మిక ఒక సినిమా ఒప్పుకోవాలంటే అటు దర్శకుడైనా, ఇటు నిర్మాతైనా నచ్చాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news