Newsనాని భార్యపై అలాంటి పోస్ట్ చేసిన కీర్తి సురేష్ ..హీరో నానికి...

నాని భార్యపై అలాంటి పోస్ట్ చేసిన కీర్తి సురేష్ ..హీరో నానికి దిమ్మ తిరిగిపోయుంటుందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ప్రెసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది . టాలీవుడ్ లో పెద్ద అవకాశాలు దక్కించుకోలేకపోయినా సరే .. బాలీవుడ్ లో మాత్రం మంచి మంచి ఆఫర్లతో ముందుకు వెళుతుంది . కాగా రీసెంట్గా కీర్తి సురేష్ హీరో నాని భార్యపై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

నిజానికి నాని భార్య అంజనా కి కీర్తి సురేష్ ఫ్రెండ్ కావడానికి కారణం నానినే . అయితే అలాంటి నాని నీ పక్కన పెట్టేసి మన ఇద్దరం ఫోటోలు దిగాలి అంటూ కీర్తి సురేష్ అంజనాకు సజెషన్ ఇచ్చింది . దీని అంతటికి కారణం నేడు ఆమె పుట్టినరోజు . నాని భార్య అంజన పుట్టినరోజు ఈరోజు . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఆమెకు స్పెషల్గా విష్ చేసింది .

“నా కర్లీ హెయిర్ ఫ్రెండ్ కు జన్మదిన శుభాకాంక్షలు ..నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ..అయితే ఈసారి మనం ఫొటోస్ తీసుకునేటప్పుడు మధ్యలో నాని లేకుండా మనఇద్దరం దిగాలి అంటూ పోస్ట్ చేసింది”. దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ కూడా నాని భార్యకు విష్ చేస్తున్నారు . అంతేకాదు నీకు అసలు ఫ్రెండ్ అయింది నాని భార్య నాని వల్లే.. మరి అతనిని దూరం పెట్టేస్తున్నారు ఏంటి..? అంటూ జనాలు కూడా కౌంటర్ వేస్తున్నారు. ఈ ఒక్క పోస్ట్ తో వీళ్ళిద్దరి మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో అర్థమైపోతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news