MoviesTL రివ్యూ: మంగ‌ళ‌వారం… సెక్సువ‌ల్ డిజార్డ‌ర్ డ్రామా

TL రివ్యూ: మంగ‌ళ‌వారం… సెక్సువ‌ల్ డిజార్డ‌ర్ డ్రామా

టైటిల్‌: మంగ‌ళ‌వారం
నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు
మాటలు: తాజుద్దీన్ సయ్యద్ & రాఘవ్
సినిమాటోగ్ర‌ఫీ : దాశరథి శివేంద్
మ్యూజిక్ : అజనీష్ లోక్‌నాథ్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి
దర్శకత్వం: అజయ్ భూపతి
రిలీజ్ డేట్ : నవంబర్ 17, 2023

ప‌రిచ‌యం :
టాలీవుడ్‌లో ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు దర్శకుడు అజయ్ భూపతి. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్‌రాజ్‌పుత్. ఆ సినిమాతో ఇద్దరికీ కావలసినంత బోల్డ్ ఇమేజ్ వచ్చింది. ఈన్నేళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ కలిసి మంగళవారం సినిమా చేశారు. ప్రచార చిత్రాలు, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో TL సమీక్షలో చూద్దాం.

క‌థ :
మహాలక్ష్మి పురంలో గ్రామ దేవత మాలచ్చ‌మ్మ‌కి మంగళవారం అంటే ఇష్టమైన రోజు. అయితే ఆరోజు రెండేసి జంట‌ల‌ ప్రాణాలు పైలోకాలకు వెళుతాయి. అది అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆడా, మగా పేర్లు గోడపై రాయటంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఊరంతా భావిస్తారు. ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మీనా ( నందితా శ్వేత ) మాత్రం వీరిని ఎవరు హత్య చేశారన్న ? సందేహంతో ఉంటుంది. జంట హత్య జరిగాక పోస్టుమార్టం చేయడానికి ఊరి జమీందారు ప్రకాశం బాబు ( చైతన్య కృష్ణ ) ఒప్పుకోడు. రెండో జంట విషయంలో మాత్రం ఓకే అంటాడు. నిజంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా.. ఎవరైనా ? హత్య చేశారా.. ఈ వరుస మరణాలకు ఊరంతా వెలివేసిన శైలు.. శైలజ (పాయల్) కు సంబంధం ఏంటి. ఊర్లో ఫోటోగ్రాఫర్ వాసు ( శ్రావణ్ రెడ్డి ), డాక్టర్ రవీంద్ర ( విజయ్ ) , జమీందారు భార్య ( దివ్య పిళ్లై ) పాత్రలు ఏమిటి.. శైలు చిన్ననాటి ప్రియుడు రవి ఎవరు.. చివరకు ఈ కథ ఎటు మలుపులు తిరిగి ఎలా ముగిసింది.. అన్నదే మంగళవారం సినిమా.

విశ్లేష‌ణ :
ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే థ్రిల్లర్, మెసేజ్, రివెంజ్. ఇలా ఈ సినిమా ఏ కేటగిరికి వస్తుంది అంటే ప్రత్యేకంగా చెప్పలేం. ఒక పాయింట్ నుంచి మొదలైన సినిమా రకరకాల జాన‌ర్ల‌ను టచ్ చేస్తూ పతాక సన్నివేశాలకు చేరుకుంటుంది. అయితే సినిమా అంతటా దర్శకుడు అజయ్ భూపతి సస్పెన్స్ మెయింటెన్ చేశాడు. మంగళవారం మిస్టేక్ థ్రిల్లర్ తెరపై ఎందరు నటీనటులు కనిపించిన తెరవెనక హీరోలు మాత్రం ఇద్దరే అని చెప్పాలి. మొదటి హీరో ఖచ్చితంగా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొత్త తరహా సౌండ్లు వినిపించాడు. ఒక్కోసారి సన్నివేశాలనే ఆయన నేపథ్య‌ సంగీతం డామినేట్ చేసింది అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.
ఇక సినిమా రిలీజ్‌కి ముందే పాటల హిట్ అయ్యాయి. పాటలు కంటే నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంది.

ఇక రెండో హీరో దర్శకుడు అజయ్ భూపతి. ప్రేక్షకుల ఊహలు, అంచనాలకు ఏమాత్రం అందకుండా కథను ముందుకు నడిపించాడు. మంగళవారం కథ కంటే కూడా తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ పాయల్‌ క్యారెక్టర్ ద్వారా అజయ్ భూపతి డిస్కస్ చేసిన అంశం సమాజంలో మహిళలు ఎవరు పైకి చెప్పుకోలేనిది. ఈ ఎపిసోడ్ హాలీవుడ్ సినిమాను కూడా గుర్తు చేస్తుంది. అయితే ఇంటర్వెల్ ముందు వరకు కథ‌ అక్కడే ఉంటుంది. కానీ ఎంగేజ్ చేస్తుంది. ఊరి జనాల మధ్య ఫైట్ కాస్త గందరగోళంగా సినిమాకు అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది. కొందరు ఏంటి ఈ అక్రమ సంబంధాల గోల‌ అనుకుంటారు. అయితే ముగింపులో దర్శకుడు అందుకు సరైన జ‌స్టిఫికేష‌న్‌ ఇచ్చాడు.

ఇంటర్వెల్‌ తర్వాత కథలో స్పీడ్ తగ్గుతుంది. ఒక్కసారిగా సస్పెన్స్ పక్కకు వెళ్లి గ్లామర్, ఎమోషన్ కనిపిస్తుంది. పాయల్‌ పాత్రను చూస్తే కొందరికి జాలి కలుగుతుంది. ప్రేక్షకులు ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఈ సీన్లు ప్రేక్షకులు ఎలా చూస్తారు ? అనేది వాళ్ళ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి. కామంతో చూస్తే ఒకలా, క్యారెక్టర్ పరంగా చూస్తే మరోలా ఉంటాయి. ఆడియన్స్ కు సర్‌ప్రైజ్‌లు ఇచ్చే విషయంలో అజయ్ భూపతి మరో చాయిస్ ఆలోచించాల్సి ఉంది. ప్రస్తుతం సమాజంలో పోకడలను అజయ్ భూపతి పరోక్షంగా ఎత్తిచూపారు. ఇతరుల‌ తప్పుల్ని ఎత్తిచూపుతూ తాము ప్రతివ్రతలు అన్నట్టు బిల్డప్ ఇవ్వటాని చక్కగా చూపించారు. ఎలాంటి వలగారిటీ లేకుండా అజయ్ భూపతి సినిమా తెరకెక్కించాడు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్ అంశాల పరంగా మంగళవారం చాలా హైలెవ‌ల్లో ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నిర్మాణపరంగా ఖర్చుకు వెనుకాడని నిర్మాతలు సినిమాకు ప్ల‌స్‌లు. దర్శకుడు అజయ్ భూపతి ఎంతో అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. నటీనటుల విషయానికి వస్తే నటి పాయల్ తనను తాను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసుకుంది. కేవలం గ్లామర్ గాడ్ అని కాకుండా తన ప్రతిభ చూపించడానికి ఈ సినిమాలో ఆమెకు మంచిస్కోప్ లభించింది. చాలా గ్లామ‌ర్‌గా ఓ పాటలో కనిపించారు. తర్వాత భావోద్వేగా సన్నివేశాలు, బరస్ట్ అయ్యే సీన్లలో ఒదిగిపోయారు. పాయల్ స్క్రీన్ స్పేస్ తక్కువ కానీ.. ఆమె ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఎస్సైగా నందిత శ్వేత క్యారెక్టర్ కు అవసరమైన సీరియస్నెస్ చూపించారు. జమీందారు భార్యగా దివ్య పిళ్లై అందంగా కనిపించారు. మిగిలిన నటీనటులు అందరూ పాత్రల పరిధి మేరకు చేశారు.

ఫైన‌ల్‌గా…
ఫైనల్ చెప్పాలంటే మంగళవారం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడు అజయ్ భూపతి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ వచ్చారు. ట్విష్టులతో ఎంగేజ్ చేస్తూ కథ‌, క్యారెక్టర్ లను ముందుకు నడిపాడు. ఎవరు డిస్కస్ చేయని పాయింట్ తీసుకొని ఈ సినిమా తెరకెక్కించినందుకు ఆయనను కచ్చితంగా అభినందించాలి. ఇక అజనీష్ మ్యూజిక్ అదిరిపోయింది. న్యూ జనరేషన్ ప్రేక్షకులకు యూత్ కు సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది.

ఫైన‌ల్ పంచ్‌: బోల్డ్ థ్రిల్ల‌ర్‌

మంగ‌ళ‌వారం రేటింగ్ : 2.75 / 5

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news