Newsకీర్తి సురేష్ @10 ఏళ్లు: ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి...

కీర్తి సురేష్ @10 ఏళ్లు: ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే.. నిజంగానే మరో మహానటి అయ్యుండేదా..?

కీర్తి సురేష్ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మహానటిగా మనందరికీ బాగా సుపరిచితురాలు . ఒకప్పుడు మహానటి అంటే అందరూ మహానటి సావిత్రి గారిని గుర్తు చేసుకునేవారు. ఇప్పుడు మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తువచ్చే పేరు కీర్తి సురేష్. ఒకప్పటి కాలానికి మహానటి సావిత్రి గారు అయితే ఇప్పటి కాలానికి ఇప్పటి జనరేషన్ కి మహానటి అంటే కీర్తి సురేష్ . అలాంటి ఓ ప్రత్యేక ముద్ర వేయించుకునింది కీర్తి సురేష్ .

ప్రజెంట్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కీర్తి సురేష్.. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తన పదేళ్ల కెరియర్ లో చేసిన ఒకే ఒక్క తప్పు గురించి సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు . చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించింది . అయితే కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత కథల చూసింగ్ విషయంలో రాంగ్ స్టెప్ తీసుకుంది.

అందుకే కీర్తి సురేష్ దసరా సినిమా వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. మహానటి సినిమా తర్వాత ఆమె బోలెడు సినిమాలో నటించింది కానీ ఒక్క సినిమా కూడా ఆమెకు ఆశించినంత స్థాయి అందుకోలేకపోయింది . ఫైనల్లీ దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. మళ్లీ భోలా శంకర్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది . ఇప్పుడు కీర్తి సురేష్ ఒక్క హిట్ అందుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే ..ఆమె కెరియర్ టర్న్ అయిపోతుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news