News"నీకు ఆ ఓపిక లేదు కాబట్టే..లైఫ్ ఇలా తగలాడింది"..నాగచైతన్య ఇంత...

“నీకు ఆ ఓపిక లేదు కాబట్టే..లైఫ్ ఇలా తగలాడింది”..నాగచైతన్య ఇంత ఓపెన్ గా చెప్పేశాడు ఏంటి..?

సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అయ్యే వార్తలలో కచ్చితంగా హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య పేర్లు వినపడుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాల పాటు కాపురం చేసి ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో ఉండే జనాలకు సైతం నచ్చలేదు . ఇలాంటి క్రమంలోనే వీళ్ళ విడాకులకు సంబంధించిన వార్తలు ఇప్పటివరకు వైరల్ అవుతున్నాయి .

అయితే వాళ్లు మాత్రం ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా లైఫ్ లో ముందుకెళ్ళి పోతున్నారు . ప్రజెంట్ నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది . డిసెంబర్ 1 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సిరీస్ కు ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు నాగచైతన్య. కాగా సోషల్ మీడియా సెన్సేషన్ నిహారికతో కలిసి ఓ ప్రమోషనల్ వీడియోను షేర్ చేశారు.

కాగా ఈ వీడియోలో నాగచైతన్యను నీహారిక తెగ విసిగిస్తూ ఉంటుంది . ఈ క్రమంలోనే నాగచైతన్య టంగ్ స్లిప్ అవుతూ ఆమెపై ఫైర్ అవుతారు. ” మీకు ఏ మాట వినే ఓపిక లేదు కాబట్టే నీ లైఫ్ లో ఎవరూ లేరు “అంటూ కూసింత గట్టిగానే అంటాడు. దీంతో నిహారిక హర్ట్ అవుతుంది . మళ్లీ సారీ చెప్పి చైతన్య సిరీస్ ప్రమోషన్స్ ను కంటిన్యూ చేస్తారు.

అంతేకాదు మళ్లీ మాటల మధ్యలో నిహారికకు కోపం తెప్పిస్తాడు నాగచైతన్య . దీంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే దూత వెబ్ సిరీస్ మాత్రం డిసెంబర్ 1 వస్తుంది చూడండి అంటూ చెప్పుకొస్తారు. ఇదంతా ప్రమోషనల్ స్టంట్ లో భాగమే అయినప్పటికీ నాగచైతన్య మాట్లాడిన మాటలను తన మాజీ భార్య సమంతకు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు అక్కినేని అభిమానులు . పొరపాటున అన్నా కూడా నువ్వు నిజమే అన్నావు సమంతకి ఆ ఓపిక ఉంటే ఇప్పటికే మీ ఇద్దరికీ పిల్లలు పుట్టుండే వాళ్ళు ..కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి అంటూ బోల్డ్ గా కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news