Newsపాపం..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పరిస్ధితి ఇప్పుడు ఇలా ఉందో చూడండి(వీడియో)..!!

పాపం..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పరిస్ధితి ఇప్పుడు ఇలా ఉందో చూడండి(వీడియో)..!!

మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి రీసెంట్గా ప్రమాదం జరిగింది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న కంగువ సినిమా షూటింగ్లో భాగంగా సూర్యకు పెద్ద ప్రమాదమే జరిగింది. దాదాపు 38 భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం సూర్య తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో మరో రికార్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు.

అయితే సినిమా షూటింగ్లో భాగంగా ప్రమాదానికి గురైన సూర్య అదృష్టం కొద్ది గాయాలతో బయటపడ్డాడు . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చాలా టెన్షన్ పట్టారు. అయితే అప్పటినుంచి సూర్యకు సంబంధించిన ఏ ఫోటో కూడా బయటకు రాలేదు. దీంతో సూర్య హెల్త్ ఎలా ఉంది ..? ఆయన కండిషన్ ఎలా ఉంది ..? అంటూ ఫ్యాన్స్ బాగా టెన్షన్ పడ్డారు .

అయితే తాజాగా సోషల్ మీడియాలో హీరో సూర్యకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ముంబై హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్న సూర్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో సూర్యకు పక్కన తన భార్య జ్యోతిక కూడా ఉంది. అయితే సూర్య నడవలేక ఇబ్బంది పడుతూ నడుస్తున్న పొజిషన్ మనం క్లియర్ గా చూడొచ్చు. దీంతో సూర్య ఫాన్స్ బాధపడిపోతున్నారు . అయ్యయ్యో పాపం సూర్య అంటూ దిగాలుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news