Newsబిగ్ షాకింగ్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వెరీ వెరీ బ్యాడ్...

బిగ్ షాకింగ్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..ఎలా తట్టుకుంటారో ఏమో..?

ఎస్ ఇది నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఊహించిన షాక్ అని చెప్పాలి . నిన్న మొన్నటి వరకు ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలలో బిజీబిజీగా ముందుకు వెళుతూ ..ఇరువురి వైపు ఉండే ఫ్యాన్స్ ని సమాంతరంగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది .

పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓకే చేసిన ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయింది అనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఏ ముహూర్తాన ఈ సినిమాని స్టార్ట్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి ఒకదాని తర్వాత ఒకటి ఆటంకం కలుగుతూనే ఉంది.

పవన్ కి డేట్స్ కుదిరితే క్రిష్ కి డేట్స్ కుదరవు .. హెల్త్ బాగో లేకుండా కొన్ని రోజులు సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వచ్చింది. అయితే ఇప్పుడు ఏకంగా సినిమా ఆగిపోయింది అన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం హరిహర వీరమల్లు గురించి బాబి డియీల్ మాట్లాడిన కామెంట్స్ అనే తెలుస్తుంది . రీసెంట్గా అనిమల్ మూవీ తెలుగు వర్షన్ ఫ్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ..” నేను తెలుగు సినిమా అంగీకరించాను .. కానీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది “అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . అయితే ఇది హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన కామెంట్స్ నే ఇలా చేశాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇది తీవ్ర నిరాశ మిగిల్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news