Newsఆ హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చి మ‌రీ కెరీర్ నాశ‌నం చేసిన నాగార్జున‌.....

ఆ హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చి మ‌రీ కెరీర్ నాశ‌నం చేసిన నాగార్జున‌.. కింగ్ దెబ్బ‌తో మ‌టాష్‌…!

టాలీవుడ్ కింగ్ నాగార్జున కొన్ని సినిమాలలో ఆయన ఏజ్ కంటే చాలా తక్కువ ఉన్న కుర్ర భామలతో నటించాడు. దాంతో కొందరు హీరోయిన్స్ కెరీర్ మొత్తం దెబ్బతిన్నది కూడా. సీనియర్ హీరోలు ఎప్పుడు కూడా తమ ఏజ్ కి తగ్గట్టుగా హీరోయిన్స్ ని ఎంచుకుంటే అన్నీ రకాలుగా బాగానే ఉంటుంది. నయనతార చిరంజీవి బాలయ్య, వెంకటేశ్, నాగార్జున లాంటి వారికి బాగా సూటవుతుంది. కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది.

శ్రీయ శరణ్ కూడా ఈ నలుగురు స్టార్ హీరోలకి బాగా సూటయ్యే ఫిగర్. ఇక అనుష్క శెట్టి ఒక్క చిరంజీవి, బాలకృష్ణలకి అస్సలు సూటవదు. వీరి హైట్ కి అనుష్క హైట్ కి అసలు మ్యాచ్ అవదు. కాబ్ట్టి వీరికి జంటగా నటించినా సినిమా సక్సెస్ కావడం చాలా కష్టం. తమన్నా అందరికీ సూటవుతుంది. ఇప్పటికే చిరంజీవి సినిమాలో తమన్నా నటించింది కూడా.

అయితే, అప్పట్లో పూనమ్ బజ్వా కెరీర్ ని నాగార్జున నే నాశనం చేశాడని చెప్పుకున్నారు. నిజమే అనిపిస్తుంది. పూనమ్ బజ్వా ఇండస్ట్రీకొచ్చినప్పుడు చాలా చిన్న వయసు. మొదటి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాపవడం ఈమెకి పెద్ద మైనస్ అయింది. బూరెల్లాంటి బుగ్గలతో ముద్దుగా బొద్దుగా ఉందని అందరు మనసు పారేసుకున్నారు. అలాగే, నాగార్జున కూడా. కొడుకులు నాగ చైతన్య, అఖిల్ లాంటి ఏజ్ గ్రూప్ హీరోలతో చేయాల్సింది.

నాగార్జున సినిమా బాస్ లో నటించి టాలీవుడ్ లో కెరీర్ నాశనం చేసుకుంది. నాగార్జున సరసన నటించగానే అందరి అభిప్రాయాలు మారిపోయాయి. దాంతో కుర్రహీరోల పక్కన పూనమ్ బజ్వా కి హీరోయిన్ గా ఛాన్సులు ఇవ్వలేదు. లేదంటే అప్పట్లో ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి వారు మంచి ఫాంలో ఉన్నారు. వారితో నటించి సక్సెస్ అందుకుంటే పూనమ్ బజ్వా కెరీర్ ఇక్కడ ఇంకోలా ఉండేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news