Newsజుట్టుపట్టుకుని కొట్టుకునే స్దాయికి వెళ్లిపోయిన కీర్తి సురేష్-రాధిక ఆప్టే..ఏమైందంటే..?

జుట్టుపట్టుకుని కొట్టుకునే స్దాయికి వెళ్లిపోయిన కీర్తి సురేష్-రాధిక ఆప్టే..ఏమైందంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ కేవలం సినిమాలే కాదు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి సిద్ధపడుతున్నారు. మరీ ముఖ్యంగా తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్లో నటించి పాపులారిటీ దక్కించుకోవడంతో మిగతా హీరోయిన్స్ కూడా అదే మార్గంలో ముందుకెళ్తున్నారు . రీసెంట్గా సౌత్ ఇండియన్ సెన్సేషన్ కీర్తి సురేష్ సైతం వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .

యాక్టింగ్ పవర్ హౌస్ రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్క్తున్న ఈ వెబ్ సిరీస్ కి అక్క అని నామకరణం చేసిన్నట్లు తెలుస్తుంది. ఇది ఫుల్ టు ఫుల్ రివేంజ్ థ్రిల్లర్గా తెరకెక్క బోతుందట. ఆరు నెలల ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత ఈ వీక్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ సిరీస్ .

ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నెంత పగ ఉంటుందని టాక్. ఈ వెబ్ సిరీస్ లో జుట్లు పట్టుకుని కొట్టుకుంటారట . ఈ ప్రాజెక్ట్ ద్వారా రచయిత దర్శకుడు ధర్మరాజు శెట్టి పరిచయం కాబోతూ ఉండగా ఆదిత్య చోప్రా ఆయన టాలెంట్ కు ఫిదా అయ్యాడని తెలుస్తుంది. మొత్తానికి కీర్తి సురేష్ కూడా వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది . అక్క పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్లో కీర్తి సురేష్ టూ బోల్డ్ గా కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news