News' దేవ‌ర ' నుంచి జాన్వీక‌పూర్ ఫ‌స్ట్ లుక్‌.. లంగావోణీలో చంపేస్తోందిరా...

‘ దేవ‌ర ‘ నుంచి జాన్వీక‌పూర్ ఫ‌స్ట్ లుక్‌.. లంగావోణీలో చంపేస్తోందిరా బాబు..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ దేవ‌ర‌. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్నట్టు దర్శకుడు కొరటాల ఇప్పటికే ప్రకటించారు.

మొదటి భాగం షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ప్రముఖ త‌మిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్అలీ ఖాన్ విలన్‌గా కనిపిస్తున్నారు. అసలు విషయానికొస్తే ఈ సినిమాలో తంగం పాత్రలో కనిపించనున్న హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు.

జాన్వీక‌పూర్ తంగంగా ఓ మ‌త్స్య‌కార కుటుంబంలో పెరిగిన అమ్మాయిగా క‌నిపించ‌నుంది. అయితే పార్ట్ 1లో ఆమె ఎన్టీఆర్‌ను ప‌గ‌బ‌ట్టి చంపాల‌నుకునే నెగ‌టివ్ పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని తెలుస్తోంది. ఆ త‌ర్వాత అదే పాత్ర రియ‌లైజ్ అయ్యి పార్ట్ 2లో హీరోయిన్‌గా మారి ఎన్టీఆర్ ల‌క్ష్యానికి స‌హ‌క‌రిస్తుంద‌ని తెలుస్తోంది. ఇక జాన్వీ తాజా లుక్‌లో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లంగా వోణీ లుక్ లో జాన్వీకపూర్ చాలా నేచురల్‌గా అదరగొట్టేసింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతుంది. ఈ లుక్ లో జాన్వీని చూస్తుంటే ఒకప్పటి శ్రీదేవిని గుర్తుకు తెస్తుందని.. శ్రీదేవి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక దేవర ఫస్ట్ పార్ట్ 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న పాన్ ఇండియా వైడ్‌గా పలు భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news