News"ఎక్స్ట్రార్డినరీ మ్యాన్" సినిమాలో ..శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకోవడం వెనుక ఇంత...

“ఎక్స్ట్రార్డినరీ మ్యాన్” సినిమాలో ..శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకోవడం వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా..?

టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ శ్రీ లీల.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ ఈమధ్య పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో ఈమె కెరియర్ కూడా చాలా ఇబ్బందులలో పడేలా ఉందంటూ పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ వంటి సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్- శ్రీ లీల గురించి తాజాగా ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.

వీరిద్దరూ కలిసి నటించిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా డిసెంబర్ 8వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది. అయితే శ్రీ లీల నితిన్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందని విషయం కొంతమంది తెలిసి ఆశ్చర్యపోతున్నారు. దాదాపుగా వీరిద్దరి మధ్య 18 సంవత్సరాలు గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎక్స్ట్రాడినరీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నా నితిన్ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేయడం జరిగింది.

గత కొన్నేళ్ల నుంచి హీరో నితిన్ ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది కూడా స్వామి మాల వేసుకోవాలని సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్నానని తెలిపారు.. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని తెలియజేశారు. ఈ సినిమా కడుపుబ్బ ప్రేక్షకులను నవ్విస్తుందంటూ తెలిపారు.. హిట్ కొట్టాలని రీజన్ తోనే ఎక్కువగా వర్క్ చేసి మరి ఈ సినిమా షూటింగ్ను సైతం పూర్తి చేశానని తెలిపారు .

ఎక్కడా కూడా ఈ సినిమా కోసం రాజీపడలేదని తెలియజేశారు నితిన్. ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే రెండేళ్లు సమయాన్ని సైతం కేటాయించాలని తెలియజేశారు. డైరెక్టర్ ఒక్కంతం వంశీ కూడా ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు నితిన్. తను నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత మరిన్ని జాగ్రత్తలతో ఈ సినిమాని చేశామని తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news