Newsబిగ్ షాకింగ్: రవితేజ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. కొంప ముంచేశావ్...

బిగ్ షాకింగ్: రవితేజ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. కొంప ముంచేశావ్ కదా బాసూ..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా మాస్ హీరో రవితేజ అంటే స్పెషల్ క్రేజీ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో అందరూ నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని వస్తే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో రవితేజ . ఇప్పుడు ఎలాంటి స్థానంలో ఉన్నారో మనకు తెలిసిందే . ఒకప్పుడు రవితేజ సినిమాలో వరుసగా హిట్ అవుతూ వచ్చాయి .

కానీ ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి . ధమాకా సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆయన తన ఖాతాలో హిట్ వేసుకోలేకపోయాడు . ఈ క్రమంలోనే ఎవర్ గ్రీన్ హిట్ కాంబో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా ఓ సినిమా ఫిక్స్ అయినట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపించాయి . అయితే రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది.

ఈ బిగ్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాలి అనుకున్న మాట వాస్తవమే కానీ.. అది రవితేజతో తీస్తే అనుకున్నంత ప్రాఫిట్స్ రావు అని.. ధమాకా సినిమా తర్వాత రవితేజతో సినిమాలు తీసిన ఒక్క నిర్మాత కూడా లాభాల కళ్ళు చూడలేదని .. అందుకే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆపేయడం బెటర్ అంటూ మేకర్స్ డిసైడ్ అయ్యారట . అంతేకాదు ఇదే విషయం రవితేజకు చెప్పగా రవితేజ కూడా సున్నితంగానే ఈ నిర్ణయానికి ఓకే చెప్పారట .

అంతేకాదు మైత్రి సంస్థతో గోపీచంద్ మలినేని తీసుకున్న డేట్స్ ఇప్పుడు మరో హీరో కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారట . ఇది నిజంగా రవితేజ అభిమానులకి జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి . ఒక సినిమా హిట్ పడితే కానీ మళ్లీ రవితేజ హిట్ ట్రాక్ లోకి రాలేడు . డైరెక్టర్స్ కూడా ఆయనతో సినిమాలను తెర్స్కెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపించరు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news