Newsఅమ్మ బాబోయ్.. మన డాక్టర్ బాబు అలాంటి పనులు కూడా చేస్తాడా..?...

అమ్మ బాబోయ్.. మన డాక్టర్ బాబు అలాంటి పనులు కూడా చేస్తాడా..? మహా నాటీ ఫెలోనే..!!

నిరుపమ్ పరిటాల .. ఇలా చెప్తే చాలా తక్కువ మందికే గుర్తొస్తుంది . అదే డాక్టర్ బాబు అనగానే దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో అరుపులు కేకలు వినిపిస్తాయి. అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సీరియల్ లో పేరుతోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు నిరుపమ్ పరిటాల. అదేనండి మన డాక్టర్ బాబు ..వంటలక్క భర్త డాక్టర్ బాబు. నిరూపం పరిటాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .

ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు .. వచ్చిన తర్వాత ఆ పేరుని అలాగే కంటిన్యూ చేసుకోవడానికి ఇంకా ఇంకా కష్టపడుతున్నాడు . ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు. పలు సీరియల్స్ లో నటించి స్పెషల్స్ స్థానాన్ని సంపాదించుకున్న నిరూపం పరిటాల తాజాగా వెబ్ సిరీస్లో సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరూపం పరిటాలకు చాలా టఫ్ క్వశ్చన్స్ ఎదురయ్యాయి .

సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ..?మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత..? ఆ డబ్బులతో ఏం చేశారు..? ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి మీ సలహాలు ఏంటి..? పలు ప్రశ్నల పై సమాధానాలు ఇచ్చాడు . కాగా ఇలాంటి క్రమంలోనే నిరూపం పరిటాల కాలేజీలో చేసిన చిలిపి పని గురించి అడిగింది హోస్ట్ . అయితే ఏమాత్రం మొహమాట పడకుండా తాను చేసిన చిలిపి పని గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు.

“కాలేజ్ టైం లో క్లాసెస్ బంక్ కొట్టి సినిమా చూడడానికి వెళ్లే వాళ్ళమని .. బ్లాక్ లో టికెట్లు కొని మళ్లీ అదే టికెట్లను బ్లాక్ లో అమ్మేసామని ..అలనాటి రోజులను గుర్తు చేసుకున్నాడు నిరూపం పరిటాల”. దీంతో మన డాక్టర్ బాబులో ఇలాంటి చిలిపి యవ్వారాలు కూడా ఉన్నాయా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటే .. మరికొందరు కాలేజ్ డేస్ మెమోరీస్ సో స్పెషల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news