News"ఆ వీడియో చూశాక మనుషుల పై విరక్తి వచ్చింది".. కలర్స్ స్వాతీ...

“ఆ వీడియో చూశాక మనుషుల పై విరక్తి వచ్చింది”.. కలర్స్ స్వాతీ సెన్సేషనల్ కామెంట్స్..!!

కలర్స్ స్వాతి .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తూ వచ్చింది. సూపర్ హిట్ సినిమాలు అని చెప్పలేము కానీ కలర్ స్వాతి నటిస్తే ఆ సినిమాని చూడొచ్చు అని అభిమానులు చేత కామెంట్స్ చేయించుకునే స్థాయికి ఎదిగిపోయింది .

రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన కలర్స్ స్వాతి సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన కెరియర్ స్టార్టింగ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి ఓపెన్ అప్ అయింది. ఆమె మాట్లాడుతూ ..”డేంజర్ సినిమా చేస్తున్న సమయంలో అల్లరి నరేష్ గారు నాతో కంగారుగా నీకు సంబంధించి ఏదో ఎం ఎం ఎస్ వచ్చింది చూడు నై చూపించాడు”.

” ఆ వీడియో చూపించాక నాకు నా మీద విరక్తి కలిగింది .. మనుషులు ఇలా ఉంటారా..? అని అనిపించింది ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందంటూ బాధపడ్డాను.. ఆ టైంలో సినిమాలు మానేద్దాం అనుకున్నాను. కానీ పెద్ద పెద్ద స్టార్స్ కే ఇలాంటివి తప్పలేదు అని నా ఫ్రెండ్స్ నాకు ధైర్యం చెప్పారు . అందుకే మళ్ళీ సినిమాలు కొనసాగించాను అంటూ చెప్పుకొచ్చింది”. ప్రస్తుతం కలర్స్స్వాతి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news