Moviesపెళ్లైన నాలుగేళ్ళకి గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో..ఫ్యాన్స్ కి...

పెళ్లైన నాలుగేళ్ళకి గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో..ఫ్యాన్స్ కి దివాళి డబుల్ ధమాకా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ తండ్రి కాబోతున్నాడా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలలో ఉన్న సరే నిఖిల్ కు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలింగ్ సపరేట్ అని చెప్పాలి. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నిఖిల్ .

ప్రెసెంట్ స్వయంభు అనే సినిమా ద్వారా జనాలను పలకరించబోతున్నారు. నిఖిల్ కెరియర్లో 20వ చిత్రం గా ఈ సినిమా విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు నిఖిల్ అని ఫ్యాన్స్ ఆనందపడే లోపే మరో గుడ్ న్యూస్ వచ్చి చేరింది. నిఖిల్ తండ్రి కాబోతున్నాడట . ఆయన భార్య పల్లవి ప్రెగ్నెంట్ అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది .

ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న పల్లవి తన బేబీ బంప్ తో కనిపించడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలోనే పల్లవి గర్భవతి అంటూ కథనాలు వెలువడుతున్నాయి . అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన రానప్పటికీ నిజంగానే పల్లవి ప్రెగ్నెంట్ అంటూ కుటుంబ సభ్యుల నుంచి న్యూస్ వైరల్ అవుతుంది. 2020లో కోవిడ్ ఆంక్షల మధ్య నిఖిల్ తను ప్రేమించిన అమ్మాయి పల్లవిని పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ పెళ్ళై నాలుగేళ్ల అవుతూ ఉండగా ఇన్నాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ.. ఫ్యాన్స్ ముందుగానే కంగ్రాట్యులేషన్స్ విషెస్ అందజేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news