Moviesఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమాకు ముహూర్తం ఆ రోజే... హీరోయిన్...

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమాకు ముహూర్తం ఆ రోజే… హీరోయిన్ ఎవ‌రంటే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చేయేడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్-2 సినిమాకి డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వార్-2 సినిమా తర్వాత ప్రశాంత నీల్‌తో ఎన్టీఆర్ చేబోయే సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.

ఏది ఏమైనా తారక్‌ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరిలోనూ ఎన్టీఆర్ – ప్రశాంతి నీల్ కాంబినేషన్ మూవీ ఎప్పుడు ? సెట్స్ మీదకు వెళుతుంది అన్నదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా రాబోతుంది. డిసెంబర్ 22న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. డిసెంబర్ నాటికి ప్రశాంత్‌ నీల్ సలార్ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తిచేసుకుని బయటికి వస్తున్నారు. జనవరి చివరివారం నుంచి ఎన్టీఆర్ తో తాను చేయబోయే సినిమాని ప్రశాంత్ నీల్‌ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఇండ‌స్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని అంటున్నారు.

2025 సమ్మర్ టార్గెట్ గా తమ సినిమాను రిలీజ్ చేయాలనేది ప్రశాంత్ నీల్ టార్గెట్ గా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ని పెట్టాలని ప్రశాంత నిల్ డెసిషన్ తీసుకున్నారు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించినా ఫైనల్ గా ప్రియాంక చోప్రా నటించబోతుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news