Moviesశిల్పాశెట్టి - రాజ్‌కుంద్రా విడాకుల్లో ట్విస్ట్‌... క‌న్‌ఫార్మ్ చేస్తూనే మెలిక పెట్టాడుగా...!

శిల్పాశెట్టి – రాజ్‌కుంద్రా విడాకుల్లో ట్విస్ట్‌… క‌న్‌ఫార్మ్ చేస్తూనే మెలిక పెట్టాడుగా…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఆమె భర్త రాజ్‌కుంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పలు సందేహాలను కలిగిస్తోంది. శిల్పా భర్త రాజ్‌కుంద్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడిపోతున్నట్టు ప్రకటించాడు. అయితే శిల్పా గురించి పేరు ప్రస్తావించకుండా మేము విడిపోయాము… ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నట్టు రాసుకోవచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. వీరిద్దరు నిజంగానే విడిపోయారా? విడిగా అంటే విడాకులు తీసుకున్నారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం రాజ్‌కుంద్రా చేసిన ఈ ట్వీట్ విడాకుల గురించి కాదని.. ఇన్నాళ్లు తనతో ఉన్న మాస్క్ గురించి చెప్పాడని.. ఇకపై మాస్క్ ఉపయోగించనని ఈ ట్వీట్‌ చేశాడని కామెంట్లు చేస్తున్నారు. మరో వైపు శిల్పాశెట్టి సోషల్ మీడియా ఖాతాలలో విడాకులకు సంబంధించి ఎలాంటి పోస్టులు కనిపించడం లేదు. అంతేకాదు ఈ గురువారం తన భర్త కొత్త సినిమా యూటీ69 పోస్ట్ చేస్తూ రాజ్‌కుంద్రాకు బెస్ట్ విషెస్ కూడా తెలిపింది. దీంతో వీరిద్దరూ విడిపోవడం లేదని కేవలం రాజ్‌కుంద్రా మాత్రమే మాస్క్ గురించి ట్విట్ చేశాడనే క్లారిటీ వస్తుంది.

ఇక వీరిద్దరూ 2009లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల రాజకుంద్రా తన బయోపిక్ ట్రైలర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. నీలి చిత్రాల కేసులో జైలు జీవితం గడపడం గురించి కూడా మాట్లాడారు. 2021లో రాజకుంద్రా పో… ర్న్ కేసులో ప్రధాన నిందితుడుగా అరెస్టు అయ్యి కొన్నాళ్లపాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. బెయిలుపై బయటకు వచ్చినప్పటి నుంచి రాజ్‌ తన ముఖాన్ని చూపించకుండా మాస్క్‌ ధరించి తిరుగుతున్నాడు.. చాలా రోజులుగా మాస్తో కనిపించిన రాజ్‌కుంద్రా త‌న బ‌యోపిక్‌ ట్రైలర్ లంచ్ రోజు దానిని తొలగించాడు.

ఈ సందర్భంగా రాజ్‌కుంద్రా మాట్లాడుతూ నేను నొప్పితో మాత్రమే మాస్క్‌ ధరించాను.. మీడియా విచారణ చాలా బాధాకరం.. నిజానికి ఇది నా చట్టపరమైన విచారణ కంటే చాలా బాధాకరమైనది.. నేను మీడియా నిందించను.. ఎందుకంటే వారి పని వారు చేస్తున్నారు కాబట్టి మాస్కు ధరించి కప్పిపుచ్చుకోవాల్సి రావటం చాలా బాధాకరం… నా ఇంట్లో ఇప్పటికీ స్టార్ ఉంది కానీ.. ఇప్పుడు నాకు మాస్క్ కూడా స్టార్ అయిపోయింది.. నేను నా జీవితాన్ని సినిమా తీయాలనుకున్నాను… మీ ముందుకు నా సినిమా రాకముందే నేనే మాస్క్ తీసేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా రాజ్ కామెంట్లు విడాకుల గురించా ? మాస్క్ గురించో అర్థం కావ‌ట్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news