Moviesకొరటాల - ఎన్టీఆర్ తో "దేవర" సినిమా చేయడం వెనుక ఇంత...

కొరటాల – ఎన్టీఆర్ తో “దేవర” సినిమా చేయడం వెనుక ఇంత కధ ఉందా..? రివేంజ్ స్కెచ్ మామూలుగా లేదుగా..!!

ప్రజెంట్ సినీ లవర్స్ ఎంతో ఇష్టంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద టాప్ సినిమా దేవర . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్నాడు. ఈ సినిమా కన్నా ముందు ఆర్ఆరార్ లో నటించి ఏకంగా ఇండియన్ హిస్టరీకి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు ఎన్టీఆర్ . దీంతో ఈ సినిమాపై ఫుల్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు .

ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ దేవర సినిమా పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. నిజానికి కొరటాల శివ ఈ సినిమాను ముందుగా అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నారట . కథ కూడా వివరించారట . సినిమా ఓకే అయి ఫైనలైజ్ కూడా అయిపోయిందట . కానీ లాస్ట్ మూమెంట్లో బన్నీ ఈ సినిమాను కాదు అంటూ మరో సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వడం.. ఈ సినిమా హోల్డ్ లో పడిపోవడం జరిగిపోయింది .

ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని కొరటాల శివ ఇదే కథతో ఎన్టీఆర్ వద్దకు వెళ్లాడు . ఆయన పై ఉన్న అభిమానంతో కధ నచ్చటంతో యాక్సెప్ట్ చేసిన తారక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా మరో క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు తారక్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news